Hanuman Ansh Telugu: ‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?

Hanuman Ansh Telugu Release Date

Hanuman Ansh Telugu Release Date

Hanuman Ansh Telugu Release: చిన్న సినిమాగా విడుదలైన ‘హనుమాన్‌ అంశ్‌’.. సంచలన విజయాన్ని అందుకుంది. రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 7న విడుదలై.. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటివరకు రూ.400+కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతున్న హనుమాన్‌ అంశ్‌.. అక్టోబర్ 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేస్తోంది. మైత్రి మూవీస్ డిస్టిబ్యూట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో నిర్మాత రవి, డిస్టిబ్యూటర్ శశి మాట్లాడారు.

హనుమాన్‌ అంశ్‌ను మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రిలీజ్ చేస్తున్నారని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి, మైత్రి మూవీస్ నుంచే అయన సినిమా ప్లాన్ చేసుకున్నారని న్యూస్ చక్కర్లు కొట్టాయి. ప్రెస్‌ మీట్‌లో శశి మాట్లాడుతుండగా.. దీనిపై ఓ ప్రశ్న ఎదురైంది. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి? అని అడగ్గా.. ‘పై స్థాయిలో ఏం జరిగిందో నాకు తెలియదు. వేరే సోర్స్ ద్వారా నేను కూడా ట్రై చేశా. ఆ సోర్స్ నుంచి కూడా మనకే ఇచ్చారు. ఇప్పుడు హోంబలే కూడా మాకే అవకాశం ఇచ్చారు. ఫైనల్లీ ఆ హనుమంతుడి ఆశీర్వాదం నాపై ఉంటుందనుకుంటున్నా’ అని శశి చెప్పుకొచ్చారు.