Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanuman Ansh Telugu Release Date: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘హనుమాన్ అంశ్’ సినిమా పేరు మార్మోగుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ఈ సినిమా ఆధ్యాత్మికతను, సినిమాటిక్ అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తోంది. రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హనుమాన్ అంశ్ ఆగస్టు 7న విడుదలై.. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో చిన్న బడ్జెట్ సినిమాల్లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రంగా హనుమాన్ అంశ్ రికార్డుల్లో నిలిచింది.
ఇప్పటికే హిందీతో పాటు పలు భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న హనుమాన్ అంశ్.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తెలుగు వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు ఈ ఆధ్యాత్మిక కథను థియేటర్లలో చూసే అవకాశం దక్కనుంది. ఇప్పటికే ఇతర భాషల్లో సినిమాకు వచ్చిన స్పందన నేపథ్యంలో తెలుగు వెర్షన్‌పై కూడా ఆసక్తి నెలకొంది.
Also Read
హనుమాన్ అంశ్‌కు సీక్వెల్ కూడా రాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ కథను మొత్తం మూడు భాగాలుగా రానుండగా.. రెండో భాగంగా హనుమాన్ అంశ్ 2 రూపొందనుంది. సీక్వెల్‌కు సంబంధించిన పనులు కూడా ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. నిర్మాత అనుప్రియా నాగర్ మాట్లాడుతూ.. రెండో భాగాన్ని కూడా సాధ్యమైనంత తక్కువ బడ్జెట్లోనే రూపొందించాలని భావిస్తున్నట్లు తెలిపారు. కథ డిమాండ్ చేస్తే మాత్రమే బడ్జెట్‌ను పెంచుతామని, లేదంటే మొదటి భాగానికి ఉపయోగించిన స్థాయిలోనే సీక్వెల్‌ను తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీ.. తెలుగు వెర్షన్‌తో మరింత మంది ప్రేక్షకులకు చేరువ కానుంది.
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?