టాలీవుడ్ సహా కోలీవుడ్‌లో పాపులర్ అయిన స్టార్ హీరోయిన్ హన్సిక ఇటీవల విడాకుల పుకార్లతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడివిడిగా నివసిస్తున్నారని వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే గతంలో సోహైల్ హన్సిక చిన్ననాటి ఫ్రెండ్ రింకీ బజాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుకకు హన్సిక సైతం హాజరైంది. కానీ, ఆ బంధం ఎక్కువ రోజులు నిలువలేకపోయింది. ఆ తర్వాత సోహైల్‌కు హన్సిక దగ్గరైంది. కొద్దిరోజులకు ఇద్దరు డిసెంబర్ 4, 2022న జైపూర్‌లో వివాహం చేసుకున్నారు. ప్రతి ఏడాది హన్సిక పెళ్లి రోజున స్పెషల్ ఫొటోస్ షేర్ చేస్తూ వస్తుంది. గతేడాది డిసెంబర్లో సైతం సెకండ్ యానివర్సరీ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. కానీ ప్రజంట్ హన్సిక – సోహైల్ జంట విడిపోతుందన్న ప్రచారం ఊపందుకోవడం.. అందరిని షాక్‌కి గురి చేస్తోంది.
Also Read: Son-Of-Sardar 2 : వాయిదా పడ్డ ‘సన్ ఆఫ్ సర్దార్ 2’.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!
ఈ నేపథ్యంలో తాజాగా సోహైల్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తన భార్య హన్సికతో విడాకుల విషయంలో జరుగుతున్న పుకార్లను తిప్పికొట్టారు. ఈ రూమర్లు పూర్తిగా తప్పుడు అని స్పష్టంగా చెప్పారు. కానీ, ప్రస్తుతం హన్సిక తల్లితో కలిసి ఉండడం, సోహైల్ తన తల్లిదండ్రులతో నివసించడం పై మాత్రం ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. హన్సిక కూడా ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంపై హన్సిక స్పందించాల్సి ఉంది.