Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kona Venkat: చిన్న సినిమాలు తీయడం ఒక ఎత్తయితే.. వాటిని థియేటర్ల దాకా తెచ్చి, ఓటీటీ డీల్స్ కుదుర్చుకోవడం నేటి రోజుల్లో నిర్మాతలకు పెద్ద సాహసమే. అయితే షూటింగ్ మొదలుపెట్టకముందే గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు సినిమాను అమ్మేసి సెట్స్ పైకి వెళ్లడం ఎక్కడైనా చూశారా? సరిగ్గా అలాంటి అరుదైన ఫీట్‌తో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది ‘హైకూ’ చిత్రం. ఏగన్, ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్పై ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో డా.డి.అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మించిన ‘హైకూ’ అక్టోబర్ 23న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కోన వెంకట్ చిత్ర యూనిట్ గురించి మాట్లాడారు. “హైకూ సినిమా ట్రైలర్ చూడగానే ఎంతో హాయిగా, ఆహ్లాదంగా అనిపించింది. అసలు సినిమా తీయకముందే.. కేవలం కథ చెప్పి నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మేయడం, ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టడం నిజంగా మామూలు విషయం కాదు. అంత పెద్ద ఓటీటీ సంస్థకు స్క్రిప్ట్ ఎంతగా నచ్చితే అలా ముందే కొనుగోలు చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరినీ మళ్లీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే పక్కా సిన్సియర్ లవ్ స్టోరీ ఇది” అని కోన వెంకట్ వెల్లడించారు.
Also Read
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
ప్రేమలో ఉండే మాధుర్యంతో పాటు అందులోని కాంప్లికేషన్స్, రిలేషన్షిప్స్లో వచ్చే ఒడిదుడుకులను చాలా నేచురల్‌గా ఈ సినిమాలో చూపించినట్లు చిత్ర బృందం తెలిపింది. హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ.. కథ విన్న వెంటనే మనసుకు బాగా కనెక్ట్ అయిపోయి ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేశానని, ప్రేమలో ఉన్నవారితో పాటు పెళ్లైన జంటలకు కూడా ఈ కథ తప్పకుండా నచ్చుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. హీరో ఏగన్ మాట్లాడుతూ.. తామంతా ఎంతో కష్టపడి మనసుపెట్టి చేసిన సినిమా ఇదని, సంగీత దర్శకుడు సిద్దు కుమార్ అద్భుతమైన పాటలు ఇచ్చారని, కచ్చితంగా హైదరాబాద్‌లో మళ్లీ సక్సెస్ మీట్ జరుపుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడు రామ్ జగదీశ్ మాట్లాడుతూ.. తమిళంలో తెరకెక్కిన ఈ అందమైన కథ తెలుగులోకి రావడం సంతోషంగా ఉందని, హీరోయిన్ శ్రీదేవి తన ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుందని కొనియాడారు. కేవలం కంటెంట్ బలాన్ని నమ్ముకుని, షూటింగ్‌కు ముందే ఓటీటీని సైతం మెప్పించిన ఈ ‘హైకూ’ వెండితెరపై యూత్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
-
CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
-
YSRCP Nomination Row: ఏపీ స్థానిక ఎన్నికలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!