సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘గల్లీ రౌడీ’. కోన వెంకట్ సమర్పణలో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి. సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ తో సహా కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాయని, సెన్సార్ కు తొలి కాపీని సిద్ధం చేస్తున్నామని నిర్మాత ఎవీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ,” ‘దేనికైనా రెఢీ’ తర్వాత నేను, నాగేశ్వర్ రెడ్డి కలిసి పనిచేసిన చిత్రమిది. సందీప్‌కు జోడీగా నేహా శెట్టి నటించింది. ఆమె చక్కని కామెడీ టైమింగ్ ఉన్న నటి. బాబీ సింహ, వెన్నెల కిషోర్, పోసాని ఇలా మాయ జరిగినట్లు అందరినీ సినిమా కలిపేసింది. ఇదొక ‘ఢీ’ లాంటి సినిమా” అని అన్నారు.
Read Also : కమల్ అభిమాని వజ్ర వరల్డ్ రికార్డ్!
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ, ”అందరూ నవ్వుకునే చిత్రం ‘గల్లీ రౌడీ’. ఇందులో మా తాత రౌడీ… మా నాన్న రౌడీ. నాకు రౌడీ కావడం ఇష్టముండదు. స్కూల్ నుంచి లాక్కొచ్చి రౌడీని చేస్తారు. రాజేంద్ర ప్రసాద్‌గారు భయస్తుడైన కానిస్టేబుల్ గా నటించారు. ఆయన్ని చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పనిచేయడం మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్. భాను, నందు, సాయి కి థాంక్స్. చక్కటి కథ కుదిరింది. నిర్మాత ఎంవీవీ సత్యనారాయణగారు ఎంత పెద్ద పోజిషన్‌లో ఉన్నా డౌన్ టు ఎర్త్ పర్సన్. బాబీ సింహా ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేశాడు. నాకు మంచి ఫ్రెండ్. అడగ్గానే నటించినందుకు తనకు థాంక్స్” అని అన్నారు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు దర్శక నిర్మాతలు.