Gossip : “మనం సరదాగా అనే ఆ ఒక్క మాట ఇతరుల జీవితాల్ని కూల్చేయొచ్చు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా హల్చల్, పుకార్లు ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తాయనే ఆసక్తికరమైన సామాజిక అంశాన్ని జోడిస్తూ తెరకెక్కిన సరికొత్త చిత్రం “గాసిప్”. మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మించారు. వైభవ్ కౌండిన్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా నిర్వహించిన ఈవెంట్లో ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సినిమా పవర్ ఫుల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
“మన నిత్యజీవితంలో ‘గాసిప్’ అనేది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది. కానీ, మనం సరదాగా అనే కొన్ని మాటలు అవతలి వ్యక్తి జీవితాన్ని ఎంత దారుణంగా తలకిందులు చేస్తాయో.. వారిని మానసికంగా ఎలా కూల్చేస్తాయో చూపించడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. ఇందులో నా జీవితంలో, నా ఫ్రెండ్స్ లైఫ్‌లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనలను కూడా జోడించాను. ఒక మాట మనిషిని నిలబెట్టగలదు.. అదే మాట ప్రాణం కూడా తీయగలదు. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలో చెప్పే భావోద్వేగ ప్రయాణమే ఈ చిత్రం” అని వైభవ్ స్పష్టం చేశారు. రవివర్మ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ అదిరిపోయే సంగీతాన్ని అందించగా, సతీష్ కెమెరా వర్క్, జై కుమార్ ఎడిటింగ్ బాధ్యతలు చూశారు. మహేష్ యడ్లపల్లి, పృథ్వీరాజ్, విజయ్ అదిరాజు, గురు చరణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో మెరవనున్నారు. ఎమోషన్స్, లవ్ స్టోరీ మరియు సోషల్ మెసేజ్ కలగలిపిన ఈ ‘గాసిప్’ జూన్ 26న ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి!
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?