Koragajja: కాంతార తరహా ‘కొరగజ్జ’ దేవతపై సినిమా.. గోపీ సుందర్ మ్యూజిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కొరగజ్జ’. కర్ణాటక, కేరళలోని కరావళి (తులునాడు) ప్రాంతంలో, ముంబైలోని కొన్ని ప్రదేశాలలో పూజించబడే ప్రధాన దేవత కొర గజ్జ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సుధీర్ అత్తవర్తో కలిసి పనిచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ ప్రాజెక్ట్‌ను ఓ ప్రత్యేక అనుభవంగా చెబుతున్నారు. ఈ చిత్రంతో తాను మ్యూజిక్‌లో సరికొత్త ప్రయోగాల్ని చేశానని తన వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి పంచుకున్నారు.
Prakash Raj: పహల్గాం ఉగ్రదాడిపై ప్రకాశ్ రాజ్ వ్యూహాత్మక పోస్ట్
Also Read
‘ఈ చిత్రానికి సంగీతం కంపోజ్ చేయడానికి ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. సంగీతంలో కొత్త ప్రయోగాలు చేయాల్సి వచ్చింది. గత చరిత్రను తెలుసుకోవాల్సి వచ్చింది. అందుకే కాస్త ఎక్కువ సమయం పట్టింది. నాటి ఆచారాలు, సంప్రదాయాలు అర్థం చేసుకున్న తర్వాత నాకు ఈ ట్యూన్స్ వచ్చాయి. దర్శకుడికి నా పని నచ్చినందుకు, నేను ఇచ్చిన మ్యూజిక్ నచ్చినందుకు సంతోషంగా ఉంది. ‘కొరగజ్జ’ కథాంశం కొత్త సంగీతాన్ని అన్వేషించడానికి, కొత్త శైలిని కనిపెట్టడానికి నాకు వీలు కల్పించింది. ఈ చిత్రం నాకు ఎంతో సవాలుగా అనిపించింది’ అని అన్నారు. ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయి, వీటిని వివిధ శైలి, భాషల్లో స్వరపరిచారు. ఈ పాటలకు సుధీర్ అత్తవర్ స్వయంగా సాహిత్యం అందించారు. ఈ చిత్రంలో శ్రేయ ఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, స్వరూప్ ఖాన్, అర్మాన్ మాలిక్ వంటి ప్రతిభావంతులైన గాయకులు పాటలు పాడారు. “కాంతార” సినిమా కంటే ఎంతో భిన్నంగా ఉంటుందని దర్శకుడు వెల్లడించారు. వేల దేవతలకు నిలయమైన కర్ణాటక, కేరళ గొప్ప సాంస్కృతిక వారసత్వంలో ‘కాంతార’ ఒకరిని మాత్రమే చూపించింది. దీనిపై EP శ్రీ విద్యాధర్ శెట్టి సహాయంతో దర్శకుడు సుధీర్ అత్తవర్ పరిశోధన చేశారు. ‘కాంతార’ తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం మల్టీ లాంగ్వేజెస్‌లో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
-
5 Best Salads for Glowing Skin: సింపుల్‌గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..