NTV Telugu Site icon

గోపీచంద్ ‘సీటిమార్’ రిలీజ్ ఎప్పుడంటే ?

Gopichand's Seetimaarr release date update

మాచో హీరో గోపిచంద్, తమన్నా భాటియా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటిమార్’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్యాక్డ్ స్పోర్ట్స్ డ్రామాను శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. సినిమా విడుదల కోసం ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్న గోపీచంద్ అభిమానులకు దర్శకుడు సంపత్ నంది ఒక అప్డేట్ ఇచ్చారు. ఆయన కూతురికి సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేసిన సంపత్ నంది “సీటిమార్ రిలీజ్ ఎప్పుడు నాన్నా ?… ఇది ఆమె ఒక్కదాని ఎక్స్ప్రెషన్ మాత్రమే కాదు… ప్రతి ఒక్క సీటిమార్ ఫ్యాన్ లో ఉన్న ప్రశ్న అని మాకు తెలుసు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మేము సినిమా విడుదల తేదీపై వర్క్ చేస్తున్నాము. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తాం. మీ ప్రేమకు, సపోర్ట్ కు, అర్థం చేసుకున్నందుకు థాంక్స్” అంటూ ట్వీట్ చేశారు. అయితే ‘సీటీమార్’ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ అదే రోజున నాగార్జున ‘వైల్డ్ డాగ్’, కార్తీ ‘సుల్తాన్’ విడుదల కావడంతో ‘సీటిమార్’ ను వాయిదా వేశారు. అయితే సినిమా విడుదల తేదీపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా సంపత్ నంది ఇచ్చిన వివరణ చూస్తుంటే త్వరలోనే ‘సీటిమార్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేలా కన్పిస్తోంది. కాగా గోపీచంద్, తమన్నా ఈ చిత్రంలో కబడ్డీ కోచ్ పాత్రలో కన్పించనున్నారు. ఈ చిత్రంలో దిగంగన సూర్యవంశీ, భూమికా చావ్లా, అప్సర రాణి ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణి శర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ‘సీటిమార్’ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. దీంతో సినిమా విడుదల గురించి గోపీచంద్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.