Site icon NTV Telugu

ఆగస్టులో రానున్న గోపీచంద్-నయన్ సినిమా

టాలీవుడ్ హీరో గోపీచంద్‌, నయనతార జంటగా నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’.. మాస్‌ డైరెక్టర్‌ బి. గోపాల్ తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయినా.. కరోనా కారణంగా చిత్ర విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఓ దశలో ఓటీటీ బాట పడుతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయడానికి నిర్మాత తాండ్ర రమేష్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి వ‌క్కంతం వంశీ క‌థ‌ అందించగా, మ‌ణిశ‌ర్మ సంగీతం సమకూర్చాడు. ఇక గోపీచంద్ నటిస్తున్న ‘సీటీమార్‌’ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘పక్క కమర్షియల్’ షూటింగ్ చివరిదశలో ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version