Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Film Celebrity Interviews Gopichand The Macho Star Was Attacked By The Media During The Release Of Vishwam

Gopichand : విశ్వం రిలీజ్ సందర్భంగా మాచో స్టార్ మీడియా ముచ్చట్లు

Published Date :October 10, 2024 , 7:19 am
By subbarao kilari
  • అక్టోబరు 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న విశ్వం
  • శ్రీనువైట్ల కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందన్న గోపీచంద్
  • ప్రభాస్ తో సినిమా ఉంటుందన్న గోపీచంద్
Gopichand : విశ్వం రిలీజ్ సందర్భంగా మాచో స్టార్ మీడియా ముచ్చట్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ విలేకరుల సమావేశంలో విశ్వం మూవీ విశేషాలని పంచుకున్నారు.

Q : శ్రీనువైట్ల గారు ఈ కథ నేరేట్ చేసినప్పుడు మీ ఇనిషియల్ ఫీలింగ్ ఏమిటి?
Ans – శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని చాలా బ్యాక్ అనుకున్నాం. గతంలో ఓ రెండు లైన్స్ చెప్పారు. అవి బావున్నాయి కానీ నాకు సరిపోవనిపిస్తుందని చెప్పాను. తర్వాత ‘విశ్వం’ కథ లైన్ గా చెప్పారు. పాయింట్, గ్రాఫ్ గా చాలా బావుంది. ఇందులో అన్నీ చక్కగా కుదురుతాయనిపించింది. తర్వాత అన్నీ తన స్టయిల్ కి తగ్గట్టుగా చేసుకోవడానికి ఆయన ఏడు నెలలు సమయం తీసుకొని విశ్వం కథని ఫాం చేరు. ఇందులో కంప్లీట్ గా శ్రీనువైట్ల గారి మార్క్ తో పాటు యాక్షన్ ఫన్, కామెడీ అన్నీ పెర్ఫెక్ట్ గా వున్నాయి.

Also Read

  • Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!
  • Peddi: 'టాక్సిక్' అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ 'పెద్ది'!
  • Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!
  • EPIC Teaser : ఆసక్తి పెంచేలా 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' టీజర్

Q : విశ్వం షూటింగ్ లో మిమ్మల్ని ఎక్సయిట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి ?
Ans – శ్రీనువైట్ల గారితో వర్క్ చేయడం ఎక్సైటింగ్ అనిపించింది. 24 అవర్స్ ఆయన సినిమా తప్పితే వేరేది ఆలోచించరు. ఆయనకి సహజంగా కోపం రాదు. ఒక ఆర్టిస్ట్ కి కంఫర్ట్ జోన్ ఇచ్చి కావాల్సిన పర్ఫార్మెన్స్ ని రాబట్టుకోవడంలో ఆయన మాస్టర్. ఆఫ్టర్ లౌక్యం తర్వాత అంత మంచి ఎంటర్టైన్మెంట్ విశ్వంలో కుదిరింది. షూటింగ్ చేసేటప్పుడు నేనే కొన్ని సీన్స్ కి నవ్వు ఆపుకోలేకపోయేవాడిని. చాలామంది ఆర్టిస్టులకి సారీ కూడా చెప్పాను. సీన్స్ అంత హిలేరియస్ గా వచ్చాయి.

Q :   ఇందులో ట్రైన్ ఎపిసోడ్ హైలెట్ గా వుంటుందని విన్నాం?
Ans -శ్రీను వైట్ల గారి వెంకీ సినిమాలో పాపులర్ ట్రైన్ ఎపిసోడ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆయన నుంచి మరో ట్రైన్ ఎపిసోడ్ వస్తుందంటే కంపారిజన్ ఉంటుంది. అయితే అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. అయితే ఈ కంపేరిజన్ కి విశ్వం ట్రైన్ సీక్వెన్స్ రీచ్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ చాలా అద్భుతంగా వచ్చింది.

Q :  ఇందులో పాప చుట్టూ కథ ఉంటుందా?
Ans – బేసిక్ గా ఇది హీరో స్టోరీ. పాపది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. పాపకి ఏడేళ్లు ఉంటాయి. కానీ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేసింది. ఆ పెర్ఫామెన్స్ చూసి షాక్ అయ్యాను. ఆ పాప కూడా ఈ సినిమాకి చాలా ప్లస్. శ్రీను వైట్ల గారిలో నేచురల్ గానే ఒక సెటైరికల్ కామెడీ ఉంటుంది. ఆయన సినిమాలో ప్రతి క్యారెక్టర్ రిజిస్టర్ అవుతుంటుంది. ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది, ఆయన ప్రతి క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. షూటింగ్ చేసేటప్పుడు ఆయన టైమింగ్ పట్టుకోవడానికి ఫస్ట్ టుడేస్ నాకు కొంచెం కష్టం అనిపించింది. ఆయనది చాలా యూనిక్ టైమింగ్. మూడో రోజు నుంచి కొంచెం ఎక్కువ సార్లు చేసి చూపించరా అని అడిగాను. ఆయన చేసినట్లు కాపీ కొట్టేసాను. డబ్బింగ్ కూడా ఆయనకి ఎలా కావాలో ఆయన్ని చూసి కాపీకొట్టి చెప్పేసాను(నవ్వుతూ)

Q : విశ్వం టైటిల్ గురించి?
Ans  – ఇందులో నా క్యారెక్టర్ పేరు విశ్వం. అయితే రెండు అక్షరాలు ఉన్న టైటిల్ నా సెంటిమెంట్ అనుకుంటారేమో అని శ్రీను వైట్లగారికి చెప్పాను. అయితే ఈ సినిమాకి ‘విశ్వం’ టైటిల్ యాప్ట్ అని ఆయన చెప్పారు.

Q : ఇది శ్రీను వైట్ల గారి కం బ్యాక్ ఫిల్మ్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా ?
Ans – సినిమా చూసే చెప్పాను. సినిమా చాలా బాగా వచ్చింది. అందుకే అంత కాన్ఫిడెంట్ గా చెప్పాను. డెఫినెట్ శ్రీనువైట్ల గారి పర్ఫెక్ట్ మార్క్ ఇందులో కనిపిస్తుంది. ఆయన మార్క్ పంచస్ వుంటాయి.

Q : ఈ సినిమాలో మెమరబుల్ మూమెంట్స్, మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి?
Ans – కొంత ఎపిసోడ్ మనాలి లో మైనస్ 15 వద్ద షూట్ చేశాం. ఆ కండీషన్ లో షూటింగ్ చేయడం చాలా టఫ్. చేతులు వంకర్లు పోయావే. అలాగే ఒక మెలోడియస్ సాంగ్ ఉంది. అది ఇటలీలోని షర్టీనియాలో చేశాం. ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఆ లొకేషన్ చాలా అందంగా ఉంటుంది . కానీ అక్కడికి వెళ్లి షూట్ చేయడం అనేది చాలా చాలెంజింగ్. ఒక హిల్ ఏరియా లాంటిది. కొంచెం కాలు జారిన ఎక్కడో లోయలో ఉంటాం.

Q : నిర్మాతల గురించి ?
Ans  – ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రావడం సినిమాకి మరింత ప్లస్ అయింది. అవుట్ పుట్ చాలా బావొచ్చింది.

Q : ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టదని చెప్పారు?
Ans  – సినిమా చాలా బావుంది. చూసినంతసేపు నవ్వుతూనే వుంటారు. థియేటర్ లో రెండున్న గంటల పాటు ఆడియన్స్ హిలేరియస్ గా ఎంటర్ టైన్ చేసే సినిమా ఇది. విశ్వం పర్ఫెక్ట్ పండగ సినిమా. వెరీ క్లీన్ గా వుంటుంది. ఫ్యామిలీ అంతా కలసి హాయిగా నవ్వుకోవచ్చు.

Q :  ప్రభాస్, మీ కాంబినేషన్ లో సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు?
Ans – మాకు చేయాలనే వుంది. కానీ అన్నీ సెట్ కావాలి. కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gopichand
  • Sreenuvaitla
  • Viswam
  • ViswamOnOct11th

తాజావార్తలు

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

  • Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!

  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్‌ రికెల్టన్‌’.. SRH ముందు భారీ టార్గెట్.!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions