రేపు టాలీవుడ్ హీరో గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెబుతూ ‘పక్కా కమర్షియల్’ నుంచి అట్రాక్టివ్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. గోపీచంద్ లాయర్ పాత్రలో నటిస్తుండగా.. తాజా పోస్టర్ లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా తీర్చిదిద్దుతున్నాడు. గోపీచంద్ సరసన రాశిఖన్నా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు జీఏ2 బ్యానర్లపై రూపొందుతోంది. బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక గోపీచంద్ నటిస్తున్న ‘సీటీమార్’ చిత్రం నుంచి కూడా రేపు సర్‌ప్రైజ్ రానుంది. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తుండగా.. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
గోపీచంద్ బర్త్ డే: ఆకట్టుకున్న ‘పక్కా కమర్షియల్’ పోస్టర్
