Site icon NTV Telugu

Bhimaa : గోపీచంద్ “భీమా” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 04 24 At 1.56.46 Pm

Whatsapp Image 2024 04 24 At 1.56.46 Pm

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా. ఈ సినిమాను కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహించారు. హర్షకు తెలుగులో ఇదే తొలి సినిమా కావడం విశేషం.ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు.భీమా చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియ భవానీ శంకర్ మరియు మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటించారు.ఈ సినిమాలో ముఖేష్ తివారి, వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్ మరియు నరేష్ వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సలార్, కేజీఎఫ్ చిత్రాలతో గుర్తింపు పొందిన రవి బస్రూర్ సంగీతం అందించారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన భీమా సినిమా మార్చి 8వ తేదీన థియేటర్స్‌లో రిలీజ్ అయింది.

ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు.ఈ మాస్ ఎంటర్ టైనర్‌ థియేటర్ ప్రేక్షకుల్నిఎంతగానో ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మంచి ధరకు సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ అధికారిక ప్రకటన చేసింది.భీమా మూవీ ఈ నెల 25వ తేదీ (ఏప్రిల్ 25) నుంచి డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. భీమా సినిమా థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తుంది.ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం మరియు మలయాళ మూడు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుందీ.థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ఓటిటి ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి .

Exit mobile version