God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటసింహం నందమూరి బాలకృష్ణ నటప్రస్థానం ఒక అద్భుతం. ఐదు దశాబ్దాలకు పైగా సాగుతున్న బాలయ్య కెరీర్లో ఎన్నెన్నో అపూర్వ విజయాలు, మరెవరికీ సాధ్యంకాని రికార్డులు. వసూళ్ల పరంగానే కాదు, థియేటర్లలో అత్యధిక రోజులు ప్రదర్శించబడిన సినిమా కూడా బాలయ్య పేరుతోనే ఉంది. బాలకృష్ణ పని అయిపోయింది అని విమర్శకులు భావించిన ప్రతిసారీ మాస్ కంబ్యాక్ ఇవ్వడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులతో విమర్శకుల నోళ్లు మూయించాడు.
వెండితెర అరంగేట్రం : మహానటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు ఐదవ కుమారుడిగా 1960 జూన్ 10న బాలకృష్ణ జన్మించారు. తండ్రి నేర్పిన అపారమైన వృత్తి నిబద్ధత, క్రమశిక్షణ, తల్లి బసవరామతారకం అందించిన ప్రేమానురాగాలు బాలయ్యను ఒక విలక్షణమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి. ఓవైపు బడిలో పాఠాలు చదువుకుంటూనే 1974లో ఎన్టీఆర్ నటించిన తాతమ్మకల సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు బాలయ్య. అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి, దానవీరశూరకర్ణ, శ్రీమద్విరాటపర్వము, శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం, రౌడీరాముడు-కొంటె కృష్ణుడు, అనురాగదేవత, సింహం నవ్వింది, శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర” వంటి చిత్రాలలో తండ్రి న్టీఆర్ తో కలిసి నటించి మెప్పించాడు బాలయ్య. 1984లో సాహసమే జీవితం సినిమాతో సోలో హీరోగా మారారు. కానీ ఆ సినిమా ఆశించినంతగా ఆడలేదు. తొలిమూడు సినిమాలు ప్లాప్ అవడంతో బాలయ్యపై విమర్శలు వచ్చాయి. కానీ నాలుగవ సినిమాగ వచ్చిన మంగమ్మగారి మనవడు’తో బాలయ్య తన పవర్ ఏంటో చూపించాడు. ఆ సినిమా ఏకంగా 565 రోజులు ఆడి రికార్డులు క్రియేట్ చేసింది.
Also Read
- Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
- Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
- Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
- Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్‌కి తిరుగులేదు!".
క్రమశిక్షణ : బాలయ్య అంటే క్రమశిక్షణ.. ఇప్పటికీ ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేవడం, పూజా కార్యక్రమాలు ముగించుకుని, వృత్తిని దైవంగా భావిస్తూ షూటింగుల్లో పాల్గొనడం బాలయ్యకు అలవాటు. బయట ఆయన స్వభావం గురించి రకరకాల పుకార్లు వినిపించినప్పటికీ, చిత్రసీమలో ఆయనతో ఒక్కసారి పరిచయమైన వారెవరైనా సరే.. బాలయ్య అంతటి పసివాడి మనస్తత్వం గల వ్యక్తి మరొకరు ఉండరని చెబుతుంటారు.
తరాలు మారినా చెరగని రికార్డులు : టాలీవుడ్ లో మొదటి రూ. 4 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమా ( మంగమ్మ గారి మనవడు). అత్యధిక స్వర్ణోత్సవ (సిల్వర్ జూబ్లీ) చిత్రాలు కలిగిన హీరోగాచరిత్ర సృష్టించారు. ‘మంగమ్మగారి మనవడు’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘ముద్దుల మావయ్య’, ‘సమరసింహారెడ్డి’, నరసింహనాయుడు, సింహ వంటి చిత్రాలు ఇండస్ట్రీ రికార్డులుగా నిలిచాయి. ‘లెజెండ్’ సినిమా రాయలసీమలో ఏకంగా 1000 రోజులకు పైగా ప్రదర్శితమై దక్షిణాదిలోనే ఒక అరుదైన రికార్డును నెలకొల్పింది. కోడి రామకృష్ణ, బి.గోపాల్ వంటి దర్శకులతో ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ కాంబినేషన్స్ రిపీట్ చేసిన బాలయ్య.. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో అదే మ్యాజిక్ రిపీట్ చేస్తున్నారు. ‘సింహా’, ‘లెజెండ్’ ‘అఖండ’ ఒకే దర్శకుడితో వరుసగా మూడు సినిమాల్లో ద్విపాత్రాభినయం (డబుల్ రోల్) చేసి, ఆ మూడు చిత్రాలు రోజూ 4 ఆటలతో డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ (175 రోజులు) జరుపుకోవడం ఏ హీరోకూ సాధ్యం కాలేదు. అది ఒన్ అండ్ ఓన్లీ బాలయ్య కు మాత్రమే చెల్లింది. 50 ఏళ్లకు పైగా సినిమాల్లో నటుడిగా కొనసాగుతున్నందుకు గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో స్థానం దక్కింది.
హ్యాట్రిక్ ఎమ్మెల్యే : సినిమా రంగంలోనే కాదు రాజకీయాలలోను బాలయ్య రికార్డులు క్రియేట్ చేసారు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ( హిందూపురం) గెలిచి రికార్డ్ సెట్ చేసారు.
బసవతారకం హాస్పిటల్ చైర్మెన్ : బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్‌గా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా వేలాది మంది జీవితాలలో వెలుగులు నింపుతూ.. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు బాలయ్య.
నేడు 66వ పుట్టిన రోజు చేసుకుంటున్న బాలయ్య అఖండ నుండి తన 2.O స్టార్ట్ చేసారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న నలుగురు సీనియర్ హీరోలలో ఎవరికీ అందనంత స్పీడ్ లో సినిమాలు చేస్తూ మూడు జనరేషన్స్ తో జై బాలయ్యని జేజేలు కొట్టించుకుంటున్న నందమూరి నటసింహనికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు.
తాజావార్తలు
-
Ola S1Z: భారత్‌లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
-
AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. మిర్జా రహమత్ బేగ్‌పై ఎంఐఎం వేటు..
-
Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
-
CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
-
Saturday Horoscope: ఆగస్టు 29 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!