Site icon NTV Telugu

Ram Charan : రామ్ చరణ్ కి అరుదైన గౌరవం.. లండన్ బయలుదేరిన మెగా ఫ్యామిలీ!

Charan Tussads

Charan Tussads

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అరుదైన ఘనత అందుకోబోతున్నారు. మేడం టుస్సాడ్స్ లండన్ వ్యాక్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లండన్ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ ఆయనే కాబోతున్నారు. నిజానికి గతంలోనే ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల విగ్రహాలను ఆవిష్కరించారు, కానీ అవి సింగపూర్, దుబాయ్ మ్యూజియంలలో ఉన్నాయి. కానీ ప్రధానమైన లండన్ మ్యూజియంలో ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు.

Also Read : Vijay Devarakonda : తరుణ్ భాస్కర్ తో విజయ్ మరో మూవీ..?

ఈ కార్యక్రమం కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తన భార్య ఉపాసన, తండ్రి మెగాస్టార్ చిరంజీవి, తల్లి సురేఖతో కలిసి లండన్ బయలుదేరారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ మైనపు విగ్రహంతో పాటు రామ్ చరణ్ తేజ పెంపుడు జంతువు రైమ్, టాయ్ పూడిల్ జాతికి చెందిన పప్పీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. నిజానికి సోషల్ మీడియాలో రైమ్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. రామ్ చరణ్ టీమ్ ఎప్పటికప్పుడు రైమ్ ఫోటోలు, వీడియోలను సంబంధిత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తూ ఉంటారు. మొత్తానికి మెగాస్టార్ కుటుంబమంతా ఈ వ్యాక్స్ స్టాట్యూ ఆవిష్కరణ కార్యక్రమం కోసం బయలుదేరినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు మే తొమ్మిదవ తేదీన సాయంత్రం లండన్ కాలమానం ప్రకారం 6:15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.

Exit mobile version