NTV Telugu Site icon

Hunger: షార్ట్ ఫిలిమ్ కి 10 అంతర్జాతీయ అవార్డులు

Hunger Short Film

Hunger Short Film

Global Recognition For Gopal Bodepalli’s ‘Hunger’ Short Film: సినిమా అనేది కొందరికి వ్యాపారం అయితే కొందరికి ప్యాషన్. కొందరు సినిమా డబ్బుల కోసం తీస్తే ఇంకొందరు అవార్డుల కోసం తీస్తుంటారు..ఈ కోవలోనే సినిమాల మీద ఇష్టం, ప్యాషన్‌తో చేసే వారికి డబ్బుల సంగతి ఎలా ఉన్నా అవార్డులు, రివార్డులు వస్తుంటాయి. ఈక్రమంలోనే న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్న గోపాల్ బోడేపల్లి తన ప్యాషన్‌తో తీస్తున్న షార్ట్ ఫిలిమ్స్ కు ప్రపంచ వ్యాప్తంగా పేరు వస్తోంది. తాజాగా గోపాల్ బోడేపల్లి నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన హంగర్ షార్ట్ ఫిలిమ్ కు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వరించాయి.

Rashmi: వాళ్ళు మేజర్లలా రేప్ చేస్తే మైనర్లు అంటారేంటి.. వాళ్ళని వదలద్ధంటున్న రష్మీ

ఈ షార్ట్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హానరబుల్ మెన్షన్ అవార్డుని గెల్చుకుంది. అంతే కాకుండా ఈ చిత్రం ప్యారిస్, లండన్ ఉత్సవాలతో పాటు మరో 10 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులను గెల్చుకుందని మేకర్స్ వెల్లడించారు. గోపాల్ బోడేపల్లి డైరెక్షన్‌లో ఇంతకు ముందు వచ్చిన ‘మరణం’ షార్ట్ ఫిల్మ్ కూడా 34 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డు గెల్చుకుంది. ఇక ఈ రెండు చిత్రాలు దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అఫీషియల్ సెలక్షన్‌కి ఎంపిక అయ్యాయి.