NTV Telugu Site icon

wedding invitation: ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానము..అందరూ ఆహ్వానితులే

Untitled Design (1)

Untitled Design (1)

ఘట్టమనేని వారి ఇంట పెళ్లి బాజా మోగనుంది, దాదాపు 23 సంవత్సరాల తర్వాత ఘట్టమనేని వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. అతిధిలకు, బంధువులకి ఆహ్వాన పత్రికల పంపకాలు కూడా ప్రారంభించారు. ఈ వేడుకను ముత్యాల పందిరిలో, అతిరధ మహారథుల మధ్య ఘనంగా నిర్వహించనున్నారు. అన్ని ప్రాంతాల రుచులను విందులో వడ్డించనున్నారు.

ఘట్టమేని సత్యనారాయణ కనిష్ట పుత్రుడు వరుడు: మురారిని, చంటి – అన్నపూర్ణమ్మ దంపతుల కనిష్ట పుత్రిక చి||లా|| సౌ. వసుంధర కు ఇచ్చి శ్రీ క్రోధినామ సంవత్సర శుక్ల పక్ష త్రయోదశి నాడు అనగా ఆగస్టు 9న వివాహం జరిపించుటకు నిశ్చయించినారు. కావున తామెల్లరు విచ్చేసి, మా ఆతిధ్యం స్వీకరరించి వేద పండితుల సాక్షిగా ఒక్కటవుతున్న మా చిరంజీవులు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము అని ఘట్టమనేని వారి కుటుంభ సభ్యులు వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించారు.

ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే ఆగస్టు 9న ఘట్టమనేని సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు. ఆ సందర్భంగా మహేశ్ నటించిన కల్ట్ క్లాసిక్ లో ఒకటైన మురారి చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారక ప్రకటన కూడా చేసారు. దీంతో అభిమనులు ఈ రీరిలీజ్ ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు గాను ఘట్టమనేని వారి వివాహ ఆహ్వాన ప్రతీకలను డిజైన్ చేసి ప్రతి ఒక్క అభిమానిని అవాహానిస్తున్నారు. ప్రస్తుతం ఈ పత్రిక సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మురారి తో పాటు ఒక్కడు చిత్రాన్ని కూడా రీరిలీజ్ చేస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఒక్కడు ఉదయం రెండు ఆటలు, మురారి సాయంత్రం రెండు ఆటలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ప్లాన్ చేసారంటే రీ రిలీజ్ నాటికీ ఇంకెంత హంగామా చేస్తారో ఘట్టమేని అభిమానులు.

Show comments