Site icon NTV Telugu

Ghaati Pre Review: అనుష్క చేయబోయే ఊచకోతకు గూస్‌బంప్స్ గ్యారెంటీ.. రేపు ఊచకోతే?

Ghaati

Ghaati

అనుష్క లీడ్‌ రోల్‌లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒడిశా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘ఘాటి’ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో.. మొదటి నుంచి ‘ఘాటి’పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌.. అనుష్క చేయబోయే విధ్వంసానికి శాంపిల్‌గా ఉండగా.. లేటెస్ట్‌గా ప్రభాస్ చేతుల మీదుగా విడుదల అయిన రిలీజ్ ట్రైలర్ అంచనాలను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంది. ఈ రిలీజ్ ట్రైలర్‌ను సోషల్ మీడియా ఖాతా ద్వారా రిలీజ్ చేశాడు డార్లింగ్. ఇక ఈ రిలీజ్ ట్రైలర్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. అనుష్క చేయబోయే ఊచకోతకు గూస్‌బంప్స్ గ్యారెంటీ అనేలా ఉంది. స్వీటీ చేసిన యాక్షన్ సినిమాకే హైలెట్‌గా నిలిచేలా ఉంది.

Also Read : Anushka : తెలుగులో కొత్త సినిమా..ఇది పవర్ ఆఫ్ సినిమా!

సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌తో సాగిన రిలీజ్ ట్రైలర్‌లో అనుష్క పర్ఫామెన్స్ మామూలుగా లేదు. శీలావతిగా ఆమె చేసిన పోరాట సన్నివేశాలు ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచాయి. ఈసారి దర్శకుడు క్రిష్ ఊహించని యాక్షన్ ఎలిమెంట్స్‌తో అనుష్కతో ఊచకోత చేయించినట్టుగా ఉంది. అనుష్క ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ముందే రానని చెప్పినప్పటికీ.. సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే రానాతో ఫోన్ కాల్‌లో మాట్లాడిన స్వీటికి ఇప్పుడు ప్రభాస్ రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేయడం సినిమాకు మంచి బజ్ జనరేట్ అయ్యేలా చేసింది. దీంతో.. ఘాటి రాక కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం థియేటర్లోకి రానుండగా.. ఇంకొన్ని గంటల్లో తెరపై శీలావతి ఊచకోతను చూడబోతున్నాం. ఈ సినిమాలో అనుష్క పాత్ర అరుంధతికి మించి ఉంటుందనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో వేదం అనే సినిమాలో నటించారు అనుష్క. ఆ సినిమాలో సరోజ పాత్ర లాగే, ఇప్పుడు ‘ఘాటి’లో షీలావతి పాత్ర ప్రత్యేకంగా ఎప్పటికి ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుందనే అంచనాలున్నాయి.

Exit mobile version