Site icon NTV Telugu

Ghaati Trailer: సీతమ్మోరు లంకా దహనం చేస్తే? అనుష్కకి మరో అరుంధతి దొరికిందిగా!

Ghaati

Ghaati

చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఘాటి. ఇది ఒక తెలుగు యాక్షన్ క్రైమ్ డ్రామా సినిమా. హరిహరవీరమల్లు నుంచి మధ్యలో తప్పుకున్న క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని క్రిష్ స్నేహితులు రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ మీద నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పిస్తున్న ఈ సినిమాలో అనుష్క కీలక పాత్రలో నటిస్తుండగా, విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతిబాబు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఒక బాధితురాలు క్రిమినల్‌గా, లెజెండ్‌గా ఎదిగిన లైన్‌ను ఆధారంగా చేసుకుని సినిమా చేశారు.

Also Read:Tollywood: స్టార్స్ ఎవడికి కావాలిరా… కంటెంట్ ఈజ్ కింగ్ ఇక్కడ

ఘాటి సినిమా ట్రైలర్ చూస్తే బ్రిటిష్ కాలంలో కఠినమైన ఘాట్‌లలో రోడ్లు నిర్మించేందుకు పని చేసిన ఘాటీలను ఇప్పుడు గంజాయి స్మగ్లింగ్ కు వాడుతున్నట్టు చూపించారు. అలాంటి ఘాటీలైన అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రేమ జంటగా నటిస్తున్నారు. అయితే, అనుష్కను ఒక సారి టార్గెట్ చేయడంతో బాధితురాలిగా మారిన క్రిమినల్‌గా, లెజెండ్‌గా ఎదిగిన అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడుతుంది. తన ఘాటీలను ఈ ప్రమాదకరమైన వ్యాపారం నుంచి విముక్తి చేయమని ఆమె ధైర్యంగా సవాలు చేస్తుంది. చైతన్య రావు, రవీంద్ర విజయ్ నెగెటివ్ రోల్స్‌లో మెరిస్తే, జగపతిబాబు కూడా మంచి పాత్రలో కనిపిస్తున్నాడు. తన స్థానాన్ని గుర్తించేలా చేస్తాడు. సీతమ్మోరు లంకా దహనం చేs అంటూ అనుష్కను ఒక రేంజ్ పవర్ ఫుల్ గా చూపిస్తున్నారు. ఆమెకు అరుంధతి తరువాత అలంటి పవర్ ఫుల్ రోల్ పడినట్టే కనిపిస్తోంది.

నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది, కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. గత ఏడాది మార్చిలో అనౌన్స్ చేసిన ఈ సినిమా జూలై 11వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. అయితే గ్రాఫిక్ వర్క్స్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమాని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాని సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సెప్టెంబర్ 5వ తేదీన ఇప్పటికే తేజ సజ్జ మిరాయి సినిమాతో పాటు శివ కార్తికేయన్ మద్రాసి సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. ఆ సినిమాలతో ఈ సినిమా ఇప్పుడు పోటీకి దిగబోతుండడం గమనార్హం.

Exit mobile version