Site icon NTV Telugu

Devi sri prasad : గచ్చిబౌలిలో రచ్చలేపనున్న దేవిశ్రీ..

Untitled Design (5)

Untitled Design (5)

సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్.  ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీపరిశ్రమలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇప్పుడంటే తమన్ పోటీ వచ్చి కొంచం స్లో అయ్యాడు కానీ ఒకానొక టైమ్ లో స్టార్ హీరోల ప్రతిసినిమాకు దేవిశ్రీప్రసాద్ పేరు ఉండాల్సింది. అంతగా తన హావ నడిచింది. దేవి శ్రీ సరైన ఆల్బమ్ ఇస్తే అది ఎంతటి సెన్సేషన్ అవుతుందో పుష్ప సినిమానే ఒక ఉదాహరణ.

దేవి సినిమాలకు సంగీతంతో పాటు మ్యూజిక్ లైవ్ షోలు కూడా చేస్తుంటాడు. ఈ మధ్య కాలంలో అనిరుధ్, విజయ్ ఆంటోనీ, ఏఆర్  రెహమాన్ వంటి సంగీత దర్శకులు తరచు లైవ్ షో లు నిర్వహిస్తున్నారు. అదే కోవలో దేవి శ్రీ కూడా లైవ్ షోలు చేస్తున్నాడు కానీ అవి విదేశాల్లో మాత్రమే. ఇప్పటిదాకా ఇండియాలో అది హైదరాబాద్ లో లైవ్ షో చేయలేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ విషయమై దేవిని ప్రశ్నిస్తే అదిగో ఇదిగో అంటూ సమాధానం ఇచ్చాడు తప్ప లైవ్ షో చేయలేదు. ఇన్నాళ్లకు ఆ ముహూర్తం వచ్చింది. దీంతో దేవి శ్రీ ప్రసాద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.

దేవిశ్రీప్రసాద్ ఈ ఏడాది అక్టోబర్ 19న శనివారం రోజు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో తొలిసారి మ్యూజిక్ లైవ్ షో చేయబోతున్నాడు. తెలుగు ACTC ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన టిక్కెట్ల ధరలను కూడా నిర్ణయించారు. స్టార్టింగ్ ధర రూ.999 నుండి రూ. 1499, రూ. 1999, రూ. 2999గా ఫిక్స్ చేసి పేటిఎమ్, ACTC వెబ్ సైట్లలో సేల్ కి ఉంచారు. హైదరాబాద్ లో గతంలో ఇళయరాజా మూడుసార్లు, ఏఆర్ రెహమాన్ ఒకసారి లైవ్ షో ఇచ్చారు.కాగా ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ పుష్ప ది రూల్, కంగువ, తండేల్ చిత్రాలకు సంగీతం అందిస్తూ ఈ లై షో చేస్తున్నాడు.

 

Also Read: Kiran Abbavaram: ‘క’ ట్రైలర్ వచ్చేసింది.. కిరణ్ ది మాములుగా లేదుగా ..?

Exit mobile version