Site icon NTV Telugu

Pawankalyan : ఆస్కార్ అకాడమీకి కమల్ హాసన్ ఎంపిక.. ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసలు

Kamal Hasson , Pawankalyan

Kamal Hasson , Pawankalyan

ప్రపంచ చిత్రపరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అకాడెమీ 2025లో కోలీవుడ్‌ లోకనాయకుడు కమల్‌ హాసన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్‌ అకాడెమీలో సభ్యులుగా చేరాలంటూ కమల్‌ హాసన్‌తో పాటు పలువురు భారతీయ ప్రముఖ నటీనటులకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు ‘ది అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ తాజాగా విడుదల చేసిన కొత్త సభ్యుల జాబితాలో కమల్‌ హాసన్‌ పేరు ఉంది. ఎంతోమంది హాలీవుడ్‌ నటీనటులతో పాటు ఆస్కార్‌ ఓటింగ్‌ ప్రక్రియలో కమల్‌ హాసన్‌ కూడా పాలుపంచుకోనున్నారు. దీంతో భారతీయ సినీ దిగ్గజం పద్మభూషణ్ కమల్ హాసన్ ఎంపికవ్వడం దేశవ్యాప్తంగా సంబరాలు నింపింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ X (ట్విట్టర్) లో స్పందిస్తూ కమల్ హాసన్‌కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Also Read : Gayathri Gupta : నేను సె**క్సువల్.. షాకింగ్ విషయం బయట పెట్టిన ఫిదా నటి

‘కమల్ హాసన్ నటన, దర్శకత్వం, రచన, నిర్మాణం.. ప్రతి విభాగంలోనూ అద్భుతమైన నైపుణ్యం కలిగిన అసాధారణ కళాకారుడు. ఈ గౌరవం ఆయనకు నటన కోసం మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తింపు లభించింది. కమల్ హాసన్ 60 ఏళ్ల సినీ ప్రస్థానం దేశ యౌవనానికి ఆదర్శంగా నిలుస్తోంది, ఆయన ఆస్కార్ అకాడమీకి ఎంపికవడం భారతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిన చిహ్నంగా భావించవచ్చు. సినిమాను కళ గా పరిగణించే వారికి కమల్ గారు మార్గదర్శకుడు. ఆయన నైపుణ్యాన్ని ప్రపంచ సినీ రంగం గౌరవించింది. ఈ గౌరవం భారతీయ సినిమాకే గర్వకారణం. కమల్ మీకు నా తరపున హృదయపూర్వక అభినందనలు. ప్రపంచ సినిమా అభివృద్ధికి మీ సేవలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’ అని వివరించారు పవన్ కల్యాణ్.

 

Exit mobile version