అందాల చందమామ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు నేడు. ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కాజల్ పిక్స్ వైరల్ చేస్తున్నారు. ఈ ప్రత్యేకరోజు సందర్భంగా ఆమె భర్త గౌతమ్ కిచ్లు ఒక ప్రత్యేక వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆ వీడియోలో ఈ జంట స్నేహితులుగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు 30 పిక్స్ ను కలిపి ఒక వీడియోగా రూపొందించారు. “300 చిత్రాలు 300,000+ సంతోషకరమైన జ్ఞాపకాలు” క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ప్రేమ అంటే ఏంటో వివరించాడు గౌతమ్. గత ఏడాది అక్టోబర్ 30న కాజల్ ను పెళ్లాడాడు గౌతమ్. పెళ్లయిన నాటి నుంచి కాజల్ తన భర్తతో కలిసి షేర్ చేస్తున్న వీడియోలు, పిక్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇక కాజల్ అగర్వాల్ చివరిసారిగా విష్ణు మంచుతో కలిసి “మోసగాళ్లు”లో కన్పించింది. ఆమె చేతిలో ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. కాజల్ అగర్వాల్ హే సినామికా, ఆచార్య, ఘోస్టీ, ఇండియన్ 2, పారిస్ పారిస్ అనే చిత్రాలతో పాటు ప్రవీణ్ సత్తారుతో కలిసి ఇంకా టైటిల్ ఖరారు చేయని చిత్రంలో నటిస్తోంది.
బర్త్ డే రోజు కాజల్ కు భర్త స్పెషల్ విషెస్…!
