NTV Telugu Site icon

Gautam : యాక్టింగ్‌తో అదరగొట్టిన మహేశ్ కొడుకు గౌత‌మ్.. వీడియో వైరల్

Goutham

Goutham

సూపర్ స్టార్ మహేష్ బాబు.. కెరీర్ పరంగా, ఫ్యామిలీ పరంగా జెంటిల్మెన్ అని చెప్పొచ్చు. అలాగే అతని సతీమణి నమ్రత కూడా ఎంతో ప్లానింగ్‌గా ఉంటుంది. మహేశ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, మహేశ్‌కు సంబంధించిన అన్ని బిజినెస్‌లను భార్య నమ్రతా‌నే చూసుకుంటూ ఉంటుంది. అంతేకాదు మహేశ్ బాబు ఆదేశానుసారం సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ, ఎంతో మంది జీవితాలను చక్కదిద్దుతుంది నమ్రత. ఇక వీరి పిల్లలు సితార అల్‌రెడి తన కంటే ఫేమ్ సంపాదించుకుంది. కానీ కొడుకు గౌతమ్ మాత్రం సైలెంట్ అని చెప్పాలి. ఎక్కువ యాక్టివ్‌గా ఉండడు, సోషల్ మీడియాలో కూడా తక్కవగానే కనిపిస్తాడు. కానీ ఇప్పుడు సూప‌ర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మూడో త‌రం రాబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Mahesh Babu: మరో సూపర్ హిట్ యాడ్ చేసిన మహేశ్ బాబు.. సితార

ఇప్పుడిప్పుడే నటన పరంగా అడుగులు వేస్తున్న గౌత‌మ్, తాజాగా న్యూయార్క్ కాలేజీలో, మైమ్ ప్రదర్శన చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మకమైన NYU టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో తన యాక్టింగ్ తో అదరగొట్టాడు గౌతమ్. ఈ వీడియోలో.. ఓ అమ్మాయితో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నట్లు కనిపించాడు. తొలుత నవ్వుతూ, తర్వాత కోప్పడుతూ మాటలు లేకుండానే తన భావాలను అద్భుతంగా వ్యక్తం చేశాడు. అని ఎమోషన్స్‌ని బాగానే పలికించాడు గౌతమ్. ఇక ఈ వీడియోను సెరాఫీనా జేరోమి తెర‌కెక్కించ‌గా.. కాశ్వీ ర‌మ‌ణి, గౌత‌మ్ ప్రధాన పాత్రల్లో న‌టించారు.