Site icon NTV Telugu

గడ్డు పరిస్థితుల్లోను ‘గంగూభాయ్’ని గట్టెక్కించారు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా ముగిసిపోయింది అనడానికి ఇంతవరకు ఎక్కడ నిర్దారణ కాలేదు. కాకపోతే కేసులు కాస్త తగ్గడంతో సడలింపులు ఇచ్చారు. ఇక బాలీవుడ్ లో షూటింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయిన కొన్ని బడా సినిమాలు అప్పుడే సాహసం చెయ్యట్లేదు. మరికొంత సమయం తీసుకొనేలా కనిపిస్తోంది. అయితే కరోనా నిబంధనలతో ‘గంగూభాయ్ కతియావాడి’ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేశారు. ఈ సినిమా షూటింగ్ తుదిదశలో ఉండగానే.. సెకండ్ వేవ్ అడ్డుతగిలింది. ప్రస్తుత పరిస్థితుల్లో మేకర్స్ పరిమిత సంఖ్యలోనే షూటింగ్స్ కు హాజరై ముగింపు పలికారు. ఈమేరకు బాలీవుడ్ నటి అలియా భట్ ట్వీట్ చేశారు. అలియా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలోని కామాటిపురాలో కొన్ని దశాబ్దాల క్రితం హల్చల్ చేసిన గంగూభాయ్ నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version