NTV Telugu Site icon

Game Changer: గేమ్ ఛేంజర్ టీజర్ చూడాలా.. ఈ థియేటర్లలో మాత్రమే!

Game Changer

Game Changer

రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో జ‌న‌వ‌రి 10, 2025న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ల‌క్నోలో ఈ మూవీ టీజ‌ర్‌ను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ సిటీలో ఇంత గ్రాండ్‌గా టీజ‌ర్ రిలీజ్ చేస్తోన్న తొలి పాన్ ఇండియా స్టార్ రామ్ చ‌ర‌ణ్ కావ‌టం విశేషం. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైద‌రాబాద్‌ వంటి మెట్రో సిటీల్లో టీజ‌ర్ లాంచ్ కావ‌టం స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌య‌మే కానీ తొలిసారి ‘గేమ్ చేంజర్’ టీజ‌ర్‌ను న‌వంబ‌ర్ 9న‌ ల‌క్నో విడుద‌ల చేస్తూ నిజంగానే టైటిల్‌కు త‌గ్గ‌ట్టు గేమ్‌ను చేంజ్ చేశారు. భారీ అంచ‌నాలున్న గేమ్ చేంజ‌ర్ టీజ‌ర్ ఈవెంట్‌కు రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ, డైరెక్ట‌ర్ శంక‌ర్‌ స‌హా సినీ ప్ర‌ముఖులంద‌రూ హాజ‌రుకానున్నారు.

Kamal Haasan: పుట్టిన రోజు వేళ హీరో కమల్ హాసన్ ఇంటి ఎదుట ముస్లింల ధర్నా

అయితే లక్నో ప్రతిభ థియేటర్లో ఈ టీజర్ లాంచ్ చేయనుండగా మరో పది థియేటర్లలో కూడా ఈ టీజర్ ను లాంచ్ చేయనున్నారు. హైదరాబాద్ సుదర్శన్,వైజాగ్ సంగం, రాజమండ్రి శివజ్యోతి, విజయవాడ శైలజ, కర్నూల్ వీ మెగా, నెల్లూరు ఎస్ 2 థియేటర్, బెంగళూరు ఊర్వశి, అనంతపూర్ త్రివేణి, తిరుపతి పీజేఆర్, ఖమ్మం శ్రీ తిరుమల థియేటర్లలో టీజర్ చూడచ్చు. ఇక ఈ టీజర్ పై అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌లో ఉన్నాయి. అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. జ‌న‌వ‌రి 10న రిలీజ్ కానున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, వివేక్ రైట‌ర్స్‌గా వ‌ర్క్ చేశారు.

Show comments