NTV Telugu Site icon

Game Changer: సంక్రాంతికి ‘గేమ్ ఛేంజ‌ర్‌’.. రిలీజ్ డేట్ చెప్పేశారు!

Game Changer

Game Changer

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మీదున్న అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు

మూవీ నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’, ‘రా మ‌చ్చా మ‌చ్చా’ సాంగ్స్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చాయి. యూట్యూబ్ లో ‘రా మ‌చ్చా మ‌చ్చా’ 55+ మిలియన్ వ్యూస్ తొ ట్రెండింగ్ లో ఉంది. తాజాగా మూవీ రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌లో రామ్ చ‌ర‌ణ్ స్టైలిష్ లుక్‌లో అద‌ర‌గొడుతున్నారు. డైరెక్ట‌ర్ శంక‌ర్ లార్జర్ దేన్ లైఫ్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌ట‌మే కాకుండా, అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు సినిమా డిఫ‌రెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంటారు. రామ్ చ‌ర‌ణ్‌లాంటి మాస్ హీరో ఉన్న‌ప్పుడు ఆ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంటుందో చూడాల‌ని మెగాభిమానులు, మూవీ ల‌వర్స్ ‘గేమ్ ఛేంజ‌ర్‌’ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ను ఆయ‌న రూపొందిస్తున్నారు. పవరఫుల్ రోల్ లో చ‌ర‌ణ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు శంక‌ర్‌. గేమ్ చేంజర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్స్ ప్రైజ్‌కి దక్కించుకుంది.

Show comments