Site icon NTV Telugu

Ram Charan : గేమ్ ఛేంజర్ ఒకటి కాదు.. రెండు ట్రైలర్స్ ప్లానింగ్..?

Ramcharan

Ramcharan

ప్రస్తుత పరిస్థితుల్లో ట్రైలర్‌ను చూసే సినిమా పై ఓ అంచనాకు వచ్చేస్తున్నారు ఆడియెన్స్‌. ట్రైలర్ ఏ మాత్రం బాగున్నా సరే  మొదటి రోజు భారీగా టికెట్లు తెగినట్టే. ఇక పవర్ ప్యాక్డ్ ట్రైలర్ వచ్చిందంటే స్టార్ హీరోల సినిమాలకు మినిమమ్ వంద కోట్ల ఓపెనింగ్స్ వచ్చినట్టే. నిర్మాత దిల్ రాజు కూడా ఇదే చెప్పుకొచ్చాడు. ఈరోజు ట్రైలరే సినిమా రేంజ్‌ను డిసైడ్ చేస్తుందని అన్నారు. అందుకే ఓ రేంజ్‌లో గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్‌ చేయబోతున్నామని విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ ఆవిష్కరణలో భాగంగా దిల్ రాజు చెప్పుకొచ్చారు.

Also Read : PK : ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందా..? క్యాన్సిల్ అవుతుందా..?

అందుకు తగ్గట్టే శంకర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ కట్ చేసినట్టుగా ఇన్‌సైడ్ టాక్. ఇప్పటికే ట్రైలర్ ఫైనల్ కట్ పూర్తి అయినట్టుగా సమాచారం. ఇందులో.. చరణ్ పాత్రల లుక్స్, ఎమోషన్స్, శంకర్ మార్క్ యాక్షన్ హైలెట్‌గా నిలవనుందని అంటున్నారు. ముఖ్యంగా తమన్ బీజీఎం మాత్రం పీక్స్ అని అంటున్నారు. ఈ చిత్రంలో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా, రాజకీయ నాయకునిగా కనిపిస్తాడని అందరికీ తెలిసిందే. కానీ వీటితో పాటుగా చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కూడా కొంతసేపు కనిపిస్తాడని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు చరణ్ నయా లుక్‌ని కూడా ఈ ట్రైలర్‌లో రివీల్ చేస్తారని తెలుస్తోంది. మొత్తంగా గేమ్ ఛేంజర్ ట్రైలర్ మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమా నుంచి రెండు ట్రైలర్లు వస్తాయని టాక్ నడుస్తోంది. మొదటి ట్రైలర్‌ జనవరి 1న రిలీజ్‌ కానుండగా సినిమా రిలీజ్‌కు ముందు సెకండ్ ట్రైలర్ బయటికొచ్చే ఛాన్స్ ఉందని టాక్. ఫైనల్‌గా జనవరి 10న గేమ్ ఛేంజర్ థియేటర్లోకి రానుంది. మరి గేమ్ ఛేంజర్ ట్రైలర్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Exit mobile version