రీసెంట్‌గా అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా విచ్చేసిన సుకుమార్.. ‘తాను చిరంజీవిగారితో కలిసి సినిమా చూశాను. ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ. ‘రంగస్థలం’ మూవీకి చరణ్‌కు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నాం. కానీ ఈ మూవీ క్లైమాక్స్ చూసినప్పుడు మరోసారి నాకు అదే ఫీలింగ్ కలిగింది. అంతకన్నా ఎక్కువే అనిపించింది. చరణ్ చాలా బాగా చేశాడు. ఈసారి కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు.
Also Read : Naga Vamsi : ‘డాకు మహారాజ్’ ఇంటర్వెల్ సీన్ కి థియేటర్లు బ్లాస్ట్ అవుతాయ్
ఇది తప్పితే ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ సినిమా ఎలా ఉంటుందనే టాక్ పెద్దగా బయటికి రాలేదు. ఇంకా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోలేదు. కానీ గేమ్ ఛేంజర్ రివ్యూ ఇదే, సినిమా ఇలా ఉంటుంది, ఆలా ఉంటుందనే టాక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సుకుమార్ చెప్పినట్టుగానే ఈ సినిమా అవుట్ పుట్ మామూలుగా రాలేదని ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కంటే సెకెండాఫ్ పీక్స్‌లో ఉందంటూ చర్చించుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో కాలేజ్ సీన్స్ అదిరిపోయాయని, సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ అని అంటున్నారు. ఇక రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్‌లో ఉందని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. శంకర్ సినిమా పై తమిళ్‌లో అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. అందుకే.. అక్కడ గేమ్ ఛేంజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గేమ్ ఛేంజర్ రివ్యూ, టాక్ అంటూ తమిళ తంబీలు రచ్చ చేస్తున్నారు.