గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసింది. ఫస్డ్ డే ఊహించని వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ డే పోస్టర్స్ పరంగా చూస్తే గేమ్ ఛేంజర్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హెయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం రూ. 294 కోట్లతో మొదటి రోజు ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసి టాప్ ప్లేస్‌లో నిలిచింది పుష్ప2.
Also Read : Priya Prakash Varrier : మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఎక్కడ..?
దీంతో అప్పటి వరకు రూ. 223 కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న ఆర్ఆర్ఆర్ సెకండ్ ప్లేస్‌కి వెళ్లిపోయింది. ఇక రూ. 215 కోట్లతో మూడో స్థానంలో బాహుబలి 2 ఉండగా రూ. 191 కోట్లతో ‘కల్కి’ నాలుగో స్థానంలో ఉంది. ఆ తర్వాత సలార్ రూ. 178 కోట్లు, దేవర రూ. 172 కోట్లతో ఐదారు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు దేవర, సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ బ్రేక్ చేసి ఏకంగా రూ. 186 కోట్లు రాబట్టి టాప్ 4లో నలిచింది గేమ్ ఛేంజర్. దీంతో రచ్చ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి వచ్చిన సినిమా కావడం, శంకర్ డైరెక్టర్ అవడంతో భారీ అంచనాల మధ్య జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ అవగా భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ఏకంగా 1.3 మిలియన్ టికెట్లు అమ్ముడైపోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సినిమా టికెట్లు భారీగా అమ్ముడవుతున్నాయి.