Site icon NTV Telugu

Dil Raju : 2014 – 2023 సినిమా హీరో హీరోయిన్ దర్శకులకు కూడా అవార్డులు!

Dil Raju

Dil Raju

గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేదిక మీద దిల్ రాజు మాట్లాడారు. అందరికీ నమస్కారం తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈరోజు హైదరాబాద్ లో ఎంత అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే డిప్యూటీ సీఎం విక్రమార్క గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ హైటెక్స్ లో ఈవెంట్ కి వచ్చిన రాజకీయ నాయకులకు, చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మీ అందరికీ మీడియా వారికి అందరికీ స్వాగతం. 14 సంవత్సరాల తర్వాత ఈరోజు తెలుగు సినిమాకి అవార్డులు ఇచ్చుకోవడం అనేది 20 24 లో సెలెక్ట్ అయిన అన్ని సినిమాలకు 2014 తెలంగాణ ఆవిర్భావం జరిగిన ఇప్పటినుంచి ప్రతి ఏడాది మూడు బెస్ట్ ఫిలిమ్స్ జ్యూరీ సెలెక్ట్ చేశారు..

Also Read : Kannappa Trailer : కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది..

ఆ పది సంవత్సరాల సినిమాలకు ఈరోజు ఇక్కడ అవార్డులు ఇచ్చుకోవడం జరుగుతుంది. 2014 నుంచి 2023 వరకు మురళీమోహన్ ఆధ్వర్యంలో చైర్మన్గా ఉన్న జ్యూరీ మెంబర్స్ బెస్ట్ ఫిలిం సెలెక్ట్ చేయడానికి వారు తీసుకున్న అన్ని రకాల సినిమాలు చూస్తూ నేషనల్ అవార్డ్స్ పొందిన సినిమాలు, మంచి రివ్యూస్ వచ్చిన సినిమాలు, కమర్షియల్ గా బాగా ఆడిన సినిమాలను ప్రతి సంవత్సరానికి మూడు సినిమాలు సెలెక్ట్ చేశారు. ప్రతి సంవత్సరం సెలెక్ట్ అయిన మూడు సినిమాల నుంచి హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాతకు అవార్డులు ఇవ్వాలని కోరితే దానికి ప్రభుత్వం అంగీకరించింది.

Also Read : Tollywood : ఫాదర్ సెంటిమెంట్‌తో వచ్చిన.. టాలీవుడ్ బెస్ట్ మూవీస్

2024లో అద్భుతమైన కళాత్మకమైన చిన్న సినిమాలకు సైతం జయసుధ గారి ఆధ్వర్యంలో జూరీ సెలెక్ట్ చేయడం వారికి కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందించడం అనేది ఎంతో ఆనందించే విషయం. అలాగే నేషనల్ అవార్డ్స్ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు నందమూరి బాలకృష్ణ గారిని సెలెక్ట్ చేయడం. రఘుపతి వెంకయ్య అవార్డు యండమూరి వీరేంద్రనాథ్ గారిని అలాగే బియన్ రెడ్డి గారి అవార్డు సుకుమార్ గారికి అలాగే బుక్ రాసిన వారికి అవార్డు, బెస్ట్ క్రిటిక్ అవార్డు ఒక్కొక్కటి ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు.

Exit mobile version