Site icon NTV Telugu

Gaddar Awards: గద్దర్ సినీ అవార్డుల కమిటీ జ్యూరీ సభ్యులు వీరే!

Gaddar

Gaddar

తెలంగాణలో గద్దర్ సినీ అవార్డుల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కోసం జ్యూరీ సమావేశం నిన్న ప్రముఖ సినీ నటి జయసుధ చైర్మన్‌గా జరిగింది. ఈ కమిటీలోని సభ్యులు జ్యూరీగా వ్యవహరిస్తూ, వచ్చిన అప్లికేషన్లను ఫిల్టర్ చేసి అవార్డులను అందించడానికి కృషి చేయనున్నారు. ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా సీనియర్ నటి జయసుధ వ్యవహరిస్తుండగా, మెంబర్ కన్వీనర్‌గా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండి నియమితులయ్యారు.

Devi Sri Prasad: విశాఖలో దేవి శ్రీ మ్యూజికల్ నైట్ ప్రోగ్రాంపై ఉత్కంఠ.. అసలు ఏమవుతోంది?

వీరితో పాటు, జీవిత రాజశేఖర్, దర్శకులు దశరథ్, నందిని రెడ్డి, శ్రీనాథ్, ఉమామహేశ్వరరావు, శివ నాగేశ్వరరావు, వి.ఎన్. ఆదిత్య కూడా ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. అలాగే, విజయ్ కుమార్ రావు అనే ఎగ్జిబిటర్, లక్ష్మీనారాయణ, జి. వెంకటరమణ (అలియాస్ జీవి) అనే జర్నలిస్టులు, ఆకునూరు గౌతమ్ అనే ఫిల్మ్ అనలిస్ట్ కూడా కమిటీలో ఉన్నారు. ఇంకా, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, ఏడిద నాగేశ్వరరావు కుమారుడు నిర్మాత ఏడిద రాజా కూడా ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ అవార్డుల కోసం వ్యక్తిగత క్యాటగిరీలో 1172 నామినేషన్లు, చలన చిత్రాలు, డాక్యుమెంటరీలు, పుస్తకాలు తదితర క్యాటగిరీలలో 76 నామినేషన్లు స్వీకరించబడ్డాయి. మొత్తం 1248 నామినేషన్లతో ఈ అవార్డులకు భారీ స్పందన లభించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి జ్యూరీ సభ్యులు నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు.

Gaddar Awards

Exit mobile version