టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఇటీవల మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి, మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఇంద్ర రీరిలీజ్ అయ్యాయి. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్’. 2012లో విడుదలైన ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ‘గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ అయింది.
Also Read: NBK50inTFI : సింగపూర్ లో బాలయ్య 50ఇయర్స్ సినీ స్వర్ణోత్సవ వేడుకలు..
ఓ వైపు ఎమ్మెల్యే గా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ రిరిలీజ్ ను భారీ ఎత్తున ప్లాన్ చేసారు ఫ్యాన్స్. నైజాం లో అడ్వాన్స్ బుకింగ్స్ లో గబ్బర్ సింగ్ అదరగొట్టి రికార్డుల క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బ్యాండ్ మేళాలు టపాసుల మోతతో హంగామా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. గబ్బర్ సింగ్ దాదాపు 12 ఏళ్ల తర్వాత రిలీజ్ కానుండడంతో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హడావుడి మూమూలుగా లేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గబ్బర్ సింగ్ బుకింగ్స్ చూస్తుంటే కొత్త సినిమా విడుదల అన్నట్లుగా ఉన్నాయి. ప్రేక్షకుల రద్దీతో థియేటర్లు నిండిపోయాయి. మొన్న నానీ సరిపోదా శనివారం సినిమా విడుదలతో క్రాస్ రోడ్స్ లో మొదలైన హడావుడి గబ్బర్ సింగ్ రీరిలీజ్ తో తార స్థాయికి చేరుకుంది. వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు కావడంతో సంధ్య సుదర్శన్ థియేటర్ల వద్ద యూత్ సందడి. క్రాస్ రోడ్స్ నలువైపులా ఎటు చూసిన పవర్ స్టార్ అభిమానుల హడావుడి వాతావరణం కనిపిస్తోంది.