టాలీవుడ్ లో రీరిలీజ్ ల హవా కొనసాగుతుంది. స్టార్ హీరో పుట్టినరోజు అయితే చాలు అభిమానులు ఆ హీరో నటించిన సూపర్ హిట్ సినిమాలను రీరిలీజ్ చేసి సెలెబ్రేట్ చేసుకుంటున్నారు . ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఇంద్ర రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో సైతం కలెక్షన్లు అదరగొట్టింది. రీరిలీజ్ సినిమాలలో ఓవర్సీస్ లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాగా ఇంద్ర నిలిచింది. ఇంద్ర సినిమాకు ఓవర్సీస్ లో ఏకంగా 61,700 డాలర్ల కలెక్షన్లు వచ్చాయి.
Also Read: AamirKhan : నా నటన బాగోలేదు.. అందుకే సినిమా పోయింది.. తప్పు నాదే..
సెప్టెంబర్ 2 న పవర్ స్టార్ పుట్టిన రోజు కానుకగా గబ్బర్ సింగ్ సినిమా రీరిలీజ్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒకరోజు ముందుగా ‘గబ్బర్ సింగ్’ సెప్టెంబర్ 1వ తేదీన ఓవర్సీస్ లో రీరిలీజ్ అవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఈ సినిమా దూసుకుపోతుంది. నార్త్ అమెరికాలో 100కు పైగా థియేటర్లలో ఈ సినిమా రీరిలీజ్ కానుందని తెలుస్తోంది. మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ ఓజీ , హరిహర వీరమల్లు సినిమాలను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. గబ్బర్ సింగ్, ఇంద్ర రీరిలీజ్ ఓవర్సీస్ రికార్డ్ ను బ్రేక్ చేస్తే సంచలనం సృష్టిస్తుందనే చెప్పవచ్చు. పవర్ స్టార్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అయిపోయింది. ఇలాంటి సమయంలో గబ్బర్ సింగ్ రీరిలీజ్ కానుండటం, పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రీరిలీజ్ అవుతున్న సినిమా కావడం ఈ సినిమా రీరిలీజ్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి అన్నయ్య రికార్డ్ ను తమ్ముడు బ్రేక్ చేస్తాడో లేదో వేచి చూడాలి.