NTV Telugu Site icon

Gaami : ఓటీటీలో దూసుకెళ్తున్న గామి.. స్ట్రీమింగ్ కు వచ్చిన కొన్నిగంటల్లోనే..?

Whatsapp Image 2024 04 19 At 2.10.20 Pm

Whatsapp Image 2024 04 19 At 2.10.20 Pm

టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గామి”.ఈ సినిమాలో విశ్వక్ సేన్ శంకర్ అనే అఘోరా పాత్రలో నటించాడు.గామి మూవీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది..ఈ మూవీతో విధ్యాధర్ కాగిత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.గామి మూవీ మార్చి 8న థియేటర్లలో రిలీజై కమర్షియల్ గా మంచి విజయం సాధించింది.ఈ సినిమాలో విశ్వక్‌సేన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు.అలాగే ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే అలాగే విజువల్స్ కూడా అదిరిపోయాయి అంటూ ప్రేక్షకకుల నుంచి గామి మూవీకి ప్రశంసలు లభిస్తున్నాయి. 2018లో గామి మూవీని మేకర్స్ అనౌన్స్ చేశారు.అప్పటి నుంచి ఈ సినిమా సాగుతూ ఎట్టకేలకు 2024లో రిలీజైంది.అలాగే గామి మూవీ ఏప్రిల్ 12న జీ 5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఓటిటి ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.ఈ సినిమా ఓటిటీలో తెలుగు, తమిళ మరియు కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

గామి సినిమాలో చాందిని చౌదరి ,అభినయ మరియు అబ్ధుల్ సమద్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు నరేశ్ కుమార్, స్వీకర్ అగస్తి మ్యూజిక్ మరియు బాక్గ్రౌండ్ స్కోర్‌ ను అందించారు .అలాగే విశ్వనాథ్ రెడ్డి మరియు ర్యాంపి నందిగాం సినిమాటోగ్రఫీ సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి.దాదాపు ఐదు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఇరవై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.ఇదిలా ఉంటే గామి మూవీ జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్నప్పటి నుంచి రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది. విభిన్న కథాంశంతో గామి మూవీ తెరకెక్కడంతో ఓటిటి ప్రేక్షకులకు ఈ మూవీ ఎంతగానో నచ్చింది. గామి ఓటిటి స్ట్రీమింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ సాధించి రికార్డు క్రియేట్ చేసింది .విశ్వక్‌సేన్‌ ప్రస్తుతం రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌ 10 లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది .అలాగే క్యూట్ హీరోయిన్ అంజలి ముఖ్య పాత్రలో నటిస్తుంది .