NTV Telugu Site icon

G.O.A.T : విజయ్ G.O.A.T మొదటి రోజు కలెక్షన్స్.. ఎదో తేడాగా ఉందే..?

Untitled Design (12)

Untitled Design (12)

ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా GOAT ( గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైమ్). సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్నితెరకెక్కించాడు. సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా దాదాపు 3000 స్క్రీన్స్ కు పైగా గోట్ ను రిలీజ్ చేసారు. పాన్ ఇండియా భాషలలో రిలీజ్ అయిన ఈ భారీ బడ్జెట్ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా లెంగ్త్, గతంలో ఇటువంటి కథాంశంతో అనేక సినిమాలు రావడంతో ఆడియన్స్ ఈ చిత్రం పట్ల పెదవివిరిచేసారు.

కాగా గోట్ మొదటి కలెక్షన్స్ ను అధికారకంగా ప్రకటించారు మేకర్స్. వరల్డ్ వైడ్ గా గోట్ రూ. 126.32 కోట్లు రాబట్టినట్టు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. విజయ్ బ్యాక్ టూ బ్యాక్ డే -1 రూ. 100 కోట్లు కొల్లగొట్టిన హీరోగా రికార్డు క్రియేట్ చేసాడు. ఒకరకంగా ఇది అదిరిపోయే నంబర్. కానీ విజయ్ గత చిత్రాలతో పోలిస్తే గోట్ కాస్త తక్కువ కలెక్ట్ చేసిందనే చెప్పాలి. విజయ్ లాస్ట్ సినిమా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో డే – 1 రూ. 145 కోట్లు రాబట్టి తమిళనాడు ఆల్ టైమ్ డే -1 హయ్యెస్ట్ కలెక్షన్స్ సాదించిన చిత్రంగా నిలిచింది. తాజగా వచ్చిన గోట్ లియోను బీట్ చేయలేక వెనకబడింది. అటు కేరళలో మొదట రోజు రూ. 5. 80 కోట్లు మాత్రమే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనూ GOAT గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొదటి రోజు తెలుగులో ఓవరాల్ గా 2.24 కోట్ల మాత్రమే రాబట్టింది. కన్నడలో రూ. 10.15 కోట్లు రాబట్టింది. మరి ఏ రోజు రేపు లాంగ్ వీకెండ్ రావడంతో బిగ్ నంబర్స్ ఉండే అవకాశం ఉంది.

Show comments