Ranveer Singh : రణ్‌వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE

Ranveer Singh

Ranveer Singh

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, ప్రముఖ నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత ఫర్హాన్ అక్తర్ మధ్య ‘డాన్ 3’ విషయంలో తలెత్తిన వివాదం బాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దురంధర్ హిట్ అయ్యాక డాన్ 3 సినిమాకు నో చెప్పడంతో  తమకు దాదాపు రూ.45 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని ఆ మొత్తాన్ని నష్టపరిహారంగా చెల్లించాలని నిర్మాతలు డిమాండ్ చేశారు. ఈ వివాదం కాస్తా ముదరడంతో ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ (FWICE) రంగంలోకి దిగి మే 25న రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఫెడరేషన్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయంపై రణ్‌వీర్ సింగ్ గట్టిగానే స్పందించారు. ఈ బ్యాన్‌ను సవాలు చేస్తూ ఆయన చట్టపరమైన చర్యలకు దిగారు. FWICE సంస్థకు రణ్‌వీర్ లీగల్ నోటీసులు పంపడంతో వ్యవహారం కోర్టు మెట్లెక్కే పరిస్థితి వచ్చింది. రణ్‌వీర్ లీగల్ నోటీసులతో వెనక్కి తగ్గిన ఫెడరేషన్ కేవలం రెండు వారాల లోపే రణ్‌వీర్ సింగ్ పై ఉన్న బ్యాన్‌ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ సైతం స్పందిస్తూ భవిష్యత్తులో పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్మాతలకు నష్టం కలిగించవద్దని పేర్కొంది. ఫెడరేషన్ బ్యాన్ ఎత్తివేయడంతో రణ్‌వీర్ సింగ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. లీగల్ ఇష్యూస్ అన్నీ ఓ కొలిక్కి రావడంతో రణ్‌వీర్ సింగ్ తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం రణవీర్ తన సరికొత్త జాంబీ కాన్సెప్ట్ చిత్రం ‘ప్రళయ్’ షూటింగ్ మరియు ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా  ఉన్నాడు. బాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేయబోతున్న ఈ చిత్రం కోసం తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు.

×
×
Ad