Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, ప్రముఖ నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ అధినేత ఫర్హాన్ అక్తర్ మధ్య ‘డాన్ 3’ విషయంలో తలెత్తిన వివాదం బాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దురంధర్ హిట్ అయ్యాక డాన్ 3 సినిమాకు నో చెప్పడంతో తమకు దాదాపు రూ.45 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని ఆ మొత్తాన్ని నష్టపరిహారంగా చెల్లించాలని నిర్మాతలు డిమాండ్ చేశారు. ఈ వివాదం కాస్తా ముదరడంతో ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ (FWICE) రంగంలోకి దిగి మే 25న రణ్వీర్ సింగ్‌పై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఫెడరేషన్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయంపై రణ్వీర్ సింగ్ గట్టిగానే స్పందించారు. ఈ బ్యాన్‌ను సవాలు చేస్తూ ఆయన చట్టపరమైన చర్యలకు దిగారు. FWICE సంస్థకు రణ్వీర్ లీగల్ నోటీసులు పంపడంతో వ్యవహారం కోర్టు మెట్లెక్కే పరిస్థితి వచ్చింది. రణ్వీర్ లీగల్ నోటీసులతో వెనక్కి తగ్గిన ఫెడరేషన్ కేవలం రెండు వారాల లోపే రణ్వీర్ సింగ్ పై ఉన్న బ్యాన్‌ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ సైతం స్పందిస్తూ భవిష్యత్తులో పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్మాతలకు నష్టం కలిగించవద్దని పేర్కొంది. ఫెడరేషన్ బ్యాన్ ఎత్తివేయడంతో రణ్వీర్ సింగ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. లీగల్ ఇష్యూస్ అన్నీ ఓ కొలిక్కి రావడంతో రణ్వీర్ సింగ్ తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం రణవీర్ తన సరికొత్త జాంబీ కాన్సెప్ట్ చిత్రం ‘ప్రళయ్’ షూటింగ్ మరియు ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్లో సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేయబోతున్న ఈ చిత్రం కోసం తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!