Site icon NTV Telugu

Funky : ఆరోజే ఫంకీ రిలీజ్

Funky

Funky

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఫంకీ’. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకులు ఇచ్చిన అద్భుతమైన స్పందనతో ఉత్సాహంలో ఉన్న ‘ఫంకీ’ చిత్ర బృందం, ఈ సినిమాను 2026 ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. టీజర్ తో వినోదాల విందుకి హామీ ఇచ్చిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

Also Read:Rashmika Mandanna: ‘రౌడీ’ జిమ్ త్వరలో ప్రారంభిస్తా.. నేనే ట్రైనర్‌, వచ్చేయండి!

‘ఫంకీ’ సినిమా కోసం స్వచ్ఛమైన వినోదాన్ని అందిస్తూ, ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తే అద్భుతమైన బృందం ఒకచోట చేరింది. దర్శకుడు కె.వి. అనుదీప్ తన శైలి కామెడీ విందుతో తిరిగి వచ్చారు. ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. ‘జాతిరత్నాలు’ సినిమాతో సంచలనాలు సృష్టించిన ఆయన, మరోసారి విభిన్నమైన కథాంశం, కట్టిపడేసే హాస్యంతో ప్రేక్షకుల మనసు దోచుకోనున్నారు. ‘ఫంకీ’ చిత్రంలో విశ్వక్ సేన్ సినీ దర్శకుడి పాత్రను పోషిస్తుండటం విశేషం. కొత్త లుక్, కొత్త యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను సరికొత్తగా అలరించనున్నారు. ఇప్పటికే టీజర్‌లో ఆయన నటన, ఎనర్జీ, కామెడీ టైమింగ్‌కి ప్రశంసల వర్షం కురిసింది. ఈ సినిమాలో కయాదు లోహర్‌ కథానాయికగా నటిస్తున్నారు. టీజర్ లో తన అందంతో కట్టిపడేశారు. తెరపై విశ్వక్-కయాదు జోడి కొత్తగా, అందంగా కనిపిస్తూ.. యువత మనసు దోచుకుంటోంది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. అద్భుతమైన గీతాలు, నేపథ్య సంగీతంతో భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నారు.

Exit mobile version