ప్రజంట్ అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే మన భారతీయ చిత్ర పరిశ్రమ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. వరుస పాన్ ఇండియా చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్‌లు అందుకుంటా..వసుల పరంగా దూసుకుపోతున్నాయి. అయితే ఇటీవల అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి మృతి చెందిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా కృష్ణవేణి సంస్మరణ సభ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు భారతీయ చలన చిత్రాల్లో హీరోల పాత్రల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: Harshavardhan: ‘స్పిరిట్’ కోసం కసిగా పనిచేస్తున్నాను
సినిమాల ద్వారా ప్రజలకు మంచి సందేశం వెళ్లడం లేదు. దేశ ద్రోహులు, స్మగ్లర్లు, సమాజంలో తప్పుడు విధానాలు పాటించే వారి పాత్రలో హీరోలు రూపకల్పన చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదు. ఈ మూవీస్ ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం వెళుతుందన్న విషయంపై దర్శకులు ఓసారి ఆలోచన చేయాలి.చెడు పనులను ఎప్పుడూ గొప్పగా చూపించకూడదు. చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ బాధ్యతాయుతంగా ఉండాలి. హీరోల పాత్రల ప్రభావం చిన్న పిల్లలపై అధికంగా పడుతుంది. ఈ సున్నితమైన ఈ విషయాలపై సినీ పరిశ్రమలో ఒక సారి ఆలోచిస్తే బాగుంటుంది’ అని వెంకయ్య అభిప్రాయపడ్డారు. మరి ఏ సినిమాను ఉద్దేశించి ఈ మాటలు అన్నాడో తెలియదు కానీ, ప్రజంట్ వెంకయ్య వ్యాక్యలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి.