Site icon NTV Telugu

NBK : బాలయ్యకు తెలంగాణ రాష్ట్ర మాజీ సీపీ CV ఆనంద్ క్షమాపణలు

Cv Anandh

Cv Anandh

గత కొన్ని రోజులుగా  తెలంగాణ రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ పై నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోకు  క్షమాపణలు చెప్పాలని CV ఆనంద్ ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో ట్వీట్స్ చేస్తున్నారు. వివరాల్లోకెళితే.. గత నెలలో తెలుగు సినిమా పరిశ్రమలోని అగ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకులు, డిజిటల్ మూవీ కంపెనీలను, మూవీ పైరసీ  ముఠాలను అరికట్టేందుకు  హైదరాబాద్ నగర పోలీసు సైబర్ క్రైమ్ బృందంతో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు CV ఆనంద్. ఈ మీటింగ్ కు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, నాని, నాగచైతన్య, దిల్‌రాజుతో పాటు పలువురు హీరోలు, నిర్మాతలు హాజరయ్యారు. ఆ విషయాన్ని తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు CV ఆనంద్.

అయితే ఈ మీటింగ్ బాలకృష్ణను పిలవండి లేదంటే, ఆయన AP అసెంబ్లీలో అడుగుతారని ఓ నెటిజన్ వ్యంగంగా కామెంట్ చేస్తే అందుకు నవ్వుతున్న ఎమోజీ రిప్లై ఇచ్చారు CV ఆనంద్. అదే బాలయ్య అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. సీనియర్ హీరో, మూడు సార్లు ఎమ్మెల్యే అయిన శాసనసభ్యుడి పట్ల అలా కామెంట్ చేయడం సబబు కాదని తమ హీరోకు క్షమాపణలు చెప్పాలని బాలయ్య ఫ్యాన్స్ డిమాండ్ చేశాడు.

Also Read : Thalaivar173 : మామ సినిమాకు అల్లుడు డైరక్షన్.. కూతురు ఒప్పుకుంటుందా.?

ఈ విషయమై తాజాగా CV ఆనంద్ స్పందిస్తూ ” దాదాపు రెండు నెలల క్రితం చెప్పిన ఒక  ఎమోజీ కోసం, బాలయ్య అభిమానులు ఆయన యాంటీ ఫ్యాన్స్ ఒకరితో ఒకరు గొడవపడి నన్ను టార్గెట్ చేసుకోవడం నేను గమనించాను. సమయం లేకపోవడం వల్ల, నగరంలోని వివిధ సంఘటనలు, కేసులు ఇతర సమస్యలను ఎక్స్ తో పాటు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడానికి నా సోషల్ మీడియా హ్యాండ్లర్ ఉండేవాడు. సెప్టెంబర్ 29న ఈ విషయంపై ప్రెస్ మీట్ తర్వాత, బాలయ్య గారిపై పోస్ట్ చేసిన పోస్ట్‌కు సమాధానంగా అతను ఒక ఎమోజీని పోస్ట్ చేశాడు. అది పూర్తిగా తప్పు, అతను అలా చేయకూడదు. ఇప్పటివరకు నాకు దాని గురించి తెలియదు.

ఈ వివాదం గురించి తెలిసిన తర్వాత, నేను ఆ పోస్ట్‌ను తొలగించాను మరియు వివరాలు తెలుసుకుని బాలయ్య గారికి మెసేజ్ కూడా చేసాను, ఎందుకంటే నాకు ఆయన చాలా దశాబ్దాలుగా తెలుసు మరియు అది ఆయనకు ఏదైనా బాధ కలిగించి ఉంటే క్షమాపణలు కూడా కోరుతున్నాను. నేను బాలయ్య, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున సినిమాలు చూస్తూ మరియు ఆస్వాదిస్తూ పెరిగాను మరియు వారందరితో నాకు చాలా గౌరవం మరియు స్నేహం ఉంది.  మరో రెండు లేదా మూడు తప్పుడు పోస్ట్‌లు / ప్రత్యుత్తరాలలో, గత నెలలోనే నేను ఆ హ్యాండ్లర్‌ను తొలగించాను. మీరు ఇప్పుడు నా ఖాతాలో తక్కువగా పోస్ట్ లు చేయడం గమనించవచ్చు. సమయం సరిపోకపోవడంతో చాలా తక్కువ రిప్లైలు ఇస్తున్నాను. దయచేసి దీన్ని ఇక్కడితో ముగించమని నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

Exit mobile version