Site icon NTV Telugu

VIJAY : TVK విజయ్ పై మాజీ PRO షాకింగ్ కామెంట్స్

Vijay

Vijay

తమిళ స్టార్ హీరో విజయ్ పై ఆయన మాజీ PRO షాకింగ్ కామెంట్స్ చేసారు. విజయ్ కి కనీస మర్యాద కూడా ఉండదని అన్నారు. అసలు వీరిద్దరి విషయంలో అసలేం జరిగిందంటే… తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా SS రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి సంచలన విజయం సాధించిన తర్వాత తమిళ పరిశ్రమ కూడా అలాంటి సినిమా తీయాలని భావించింది. ఈ నేపధ్యంలో కత్తి వంటి సూపర్ హిట్ చేసిన విజయ్ బాహుబలి లాంటి సినిమా చేయాలని రంగంలోకి దిగాడు.

విజయ్ హీరోగా చింబు దేవన్ దర్శకత్వంలో పులి అనే సినిమాను వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎస్ కే టీ స్టూడియోస్ బ్యానర్ పై శిబు తమీన్స్, పీటీ సెల్వకుమార్ అప్పటి వరకు తమిళ్ లో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్ తో భారీ ఎత్తున  నిర్మించారు. విజయ్ తో పాటు కిచ్చా సుదీప్, అతిలోక సుందరి శ్రీదేవి, హన్సిక వంటి స్టార్స్ నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ తొలి ఆట నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అటు నిర్మాతలకు ఇటు బయ్యర్స్ కు భారీ నష్టాలు మిగిల్చింది. ఈ సినిమా మిగిల్చిన చేదు అనుభవంపై చిత్ర నిర్మాత విజయ్ మాజీ PRO టి సెల్వకుమార్ మాట్లాడుతూ  “నేను నా  25 సంవత్సరాల కృషి మరియు  నాకు ఉన్నదంతా పులి సినిమాలో పెట్టుబడి పెట్టాను, కానీ ఆ సినిమా భారీ నష్టం నాకు ఏమీ మిగలకుండా చేసింది. కానీ ఈ రోజు వరకు, విజయ్ వైపు నుండి ఓదార్పు మాట కూడా రాలేదు” అని అన్నారు.

Exit mobile version