Site icon NTV Telugu

Kortala Siva : దేవర – 2 కు రత్నవేలును తొలగించమని ఫ్యాన్స్ గోల?

Ratanavelu

Ratanavelu

యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన  దేవర సూపర్ హిట్ టాక్ తో దుసుకెళ్తోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా దావుది సాంగ్, కొన్ని సీన్స్ కు మరల యాడ్ చేయడంతో రిపీట్ ఆడియెన్స్ వస్తున్నారు. దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరోసారి ఫ్యాన్స్ ను కాలర్ ఎగరేసేలా చేసాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Harsha sai : హర్షసాయి కేసులో ట్విస్ట్.. దాసరి విజ్ఞాన్ అరెస్ట్..

రెండు భాగాలుగా రానున్న దేవర మొదటి భాగం సూపర్ హిట్ కావంతో సెకండ్ పార్ట్ పై ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొరటాల ఆ పని మీద ఉన్నారు. కాగా దేవరకు సంబంధించి ఒక విషయంలో మాత్రం తారక్ ఫ్యాన్స్ నిరుత్సహాంగా ఉన్నారు. అదే సినిమాటోగ్రఫీ. రత్నావేలు వర్క పట్ల ఫ్యాన్స్ కాసింత అసంతృప్తి గా ఉన్నారు. ఎన్టీయార్ ను సరిగా చూపించలేదని, కొన్ని సీన్స్ మరీ పేలవంగా ఉన్నాయని, ముఖ్యంగా కంటైనెర్ సీన్ సరిగా చేయలేదు అని వారి వాదన. దేవర సెకండ్ పార్ట్ కురత్నవేలు కాకుండా మరెవరినైనా తీసుకోవాలి సూచిస్తున్నారు. కొరటాల, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన జనత గ్యారేజ్ కు తిరునావరక్కరుసు ను తీసుకున్నారు. ఎన్టీఆర్ ను ఎంతో అందంగా ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా చూపించాడు. ఎలాగూ దేవరను మొదలు అవడానికి ఏడాదికి పైగా సమయం ఉంది. ఈ లోగా బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ను తీసుకోవాలని యూనిట్ ను కోరుతున్నరు ఫ్యాన్స్

Exit mobile version