NTV Telugu Site icon

First Love: హార్ట్ బ్రేక్ అయ్యింది.. థమన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Thaman Comments

Thaman Comments

First Love Song Launch: దీపు జాను, వైశాలి రాజ్ లీడ్ రోల్స్ లో బాలరాజు ఎం డైరెక్ట్ చేసి బ్యూటిఫుల్ మ్యాజికల్ ఆల్బం ‘ఫస్ట్ లవ్’. వైశాలిరాజ్ నిర్మించిన ఈ ఆల్బమ్ టీజర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా సెన్సేషనల్ కంపోజర్ ఎస్ఎస్ తమన్ ఫస్ట్ లవ్ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఎస్ఎస్ తమన్ మాట్లాడుతూ.. ఫస్ట్ లవ్ మ్యూజిక్ వీడియో చాలా బ్యూటిఫుల్ గా వుంది. సాంగ్ లో ఒక అద్భుతమైన కథ చూపించారు. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. కెమెరామెన్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు.

Lavanya: లావణ్య ప్రయివేట్ పార్ట్స్ మీద శేఖర్ బాషా దాడి?

మధు పొన్నాస్ బ్యూటీ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు. సంజీవ్ థామస్, సిద్ శ్రీరామ్ ప్రాణం పెట్టి చేశారు. అందరూ ప్రాణం పెట్టి చేయడం వలనే ఆల్బం ఇంత అద్భుతంగా వచ్చింది. దీపు, వైశాలి స్క్రీన్ పై గొప్పగా షైన్ అయ్యారు. చివరి నిమిషాలు చూస్తున్నపుడు ఒక లవ్లీ బ్రేక్ వచ్చింది. లాస్ట్ లో హార్ట్ బ్రేక్ అయ్యింది. ఈ ప్రొడక్షన్ నాకు చాలా నచ్చింది. చాలా పాషన్ తో చేశారు. ఆల్బం చాలా బాగుంది. వైశాలి, ఖుషి సినిమాలు గుర్తుకు వచ్చాయి. కొత్తవారు చేసిన ఈ మంచి ప్రయత్నానికి సిద్ శ్రీరామ్ సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా వుంది. తనకి అభినందనలు. ఈ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా వుంది. ఆల్బం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

Show comments