NTV Telugu Site icon

Filmfare Awards 2024: 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (తమిళం) 2024 విజేతలు ఎవరంటే..?

Untitled Design (49)

Untitled Design (49)

69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (తమిళం) 2024 ప్రముఖ నటీనటులు, సంగీతకారులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులను అభినందిస్తూ తిరిగి వచ్చింది. ఫిలింఫేర్ గత సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించి నటీనటులకు అవార్డులు అందజేసింది. ఈ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ ఉత్సవంలో పలువురు తారల నృత్యప్రదర్శనాలు ఆకట్టుకున్నాయి.

 69 శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 (తమిళం) విజేతలు

* ఉత్తమ చిత్రం: చిత్త (తెలుగులో చిన్నా)

* ఉత్తమ నటుడు: విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్2)

*ఉత్తమ నటి: నిమేషా సజయన్ (చిత్త)

* ఉత్తమ దర్శకుడు: S.U అరుణ్ కుమార్ (చిత్త)

*ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): వెట్రిమారన్ (విడుదలై -1)

* ఉత్తమ నటుడు (క్రిటిక్స్): సిద్ధార్థ్ (చిత్త)

* ఉత్తమ నటి (క్రిటిక్స్): ఐశ్వర్య రాజేశ్ (ఫర్హానా), అపర్ణ దాస్ (దాదా)

Also Read : Filmfare: 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. తెలుగు విజేతలు ఎవరంటే..?

* ఉత్తమ సహాయ నటుడు: ఫహద్ ఫాజిల్ (మామన్నన్)

* ఉత్తమ సహాయ నటి: అంజలి నాయర్ (చిత్త)

* ఉత్తమ గాయకుడు: హరిచరణ్ (పొన్నియిన్ సెల్వన్ 2)

* ఉత్తమ గాయని: కార్తికా వైద్యనాథన్ (చిత్త)

* ఉత్తమ గేయ సాహిత్యం: ఇలంగో కృష్ణన్ (అగ నగ.. పొన్నియిన్ సెల్వన్2)

* ఉత్తమ సంగీతం: దిబు నినాన్ థామస్, సంతోష్ నారాయణన్ (చిత్త)

* ఉత్తమ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ 2)

* ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: తోట తరణి (పొన్నియిస్ సెల్వన్ 2)

Show comments