Site icon NTV Telugu

“ఇందువదన” హీరోయిన్ ఫస్ట్ లుక్… ఇంత బోల్డ్ గానా…!!

INdu

యంగ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “ఇందువదన”. ఎంఎస్ఆర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇందువదన’లో వరుణ్ సందేశ్ సరసన ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆమె “ఇందు” పాత్రలో కనిపించనుంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో బ్లౌజ్ లెస్ శారీ ధరించి, పరువాలతో కవ్విస్తున్న ఇందు గిరిజన యువతి లుక్ యూత్ ను కట్టి పడేస్తోంది. వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో ఫారెస్ట్ ఆఫీసర్ గా ‘వాసు’ అనే పాత్రలో నటిస్తున్నాడు. వరుణ్ సందేశ్ ను కూడా పరిచయం చేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో ఈ యంగ్ హీరో సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. కొంతకాలం క్రితం విడుదలైన “ఇందువదన” ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.

Read Also : అనిల్ రావిపూడి రిలీజ్ చేసిన “100 క్రోర్స్” టీజర్

ఇక హీరో వరుణ్ సందేశ్ చాలా గ్యాప్ తీసుకుని ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. చాలాకాలం నుంచి వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్న వరుణ్ అనూహ్యంగా తన భార్యతో కలిసి బుల్లితెర పాపులర్ షో “బిగ్ బాస్”లో కన్పించి అందరికీ షాకిచ్చాడు. ఇక హౌజ్ నుంచి బయటకు వచ్చిన తరువాత కథపై కసరత్తులు మొదలెట్టిన వరుణ్ సందేశ్ ఎట్టకేలకు “ఇందువదన”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోహీరోయిన్లు కౌగిలిలో ఒదిగిపోయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు విశేషమైన స్పందన వచ్చింది. శివ కాకాని సంగీతం అందిస్తుండగా… మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు.

Exit mobile version