Faria Abdullah : ”జాతి రత్నాలు” సీక్వెల్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన చిట్టి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన యాక్టింగ్ తో ప్రేక్షకులలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది .”జాతి రత్నాలు” సినిమాతో ఫరియా అబ్దుల్లా టాలీవుడ్ కి పరిచయం అయింది.ఈ సినిమాలో చిట్టి పాత్రలో ఫరియా అద్భుతంగా నటించింది .తాను చేసిన చిట్టి పాత్ర ఆమెకు బీభత్సమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది.దీనితో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.జాతి రత్నాలు మూవీతో వరుస ఆఫర్స్ అందుకొని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ భామ తాజాగా మరో కామెడీ సినిమాతో అలరించేందుకు ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఫరియా అబ్దుల్లా నటించిన లేటెస్ట్ మూవీ “ఆ ఒక్కటి అడక్కు”.ఈ సినిమాలో కామెడీ స్టార్ అల్లరి నరేష్ హీరోగా నటించారు.ఈ మూవీ మే 3న రిలీజ్ కానుంది .ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటుంది
ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ ఒక్కటి అడక్కు సినిమాతోపాటు జాతి రత్నాలు 2 మూవీపై అప్డేట్ ఇచ్చింది చిట్టి. దీంతో ఫరియా అబ్దుల్లా కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “ఆ ఒక్కటి అడక్కు” సినిమాలో సిద్ది అనే పాత్రలో నటిస్తున్నట్లు ఆమె తెలిపింది.ఈ చిత్ర కథ పెళ్లి అనే అంశం చుట్టూ తిరుగుతూ ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.ప్రస్తుతం “జాతి రత్నాలు” మూవీ నిర్మాతలు “కల్కి 2898 ఏడి ” సినిమాతో బిజీగా ఉన్నారు. అది చాలా పెద్ద సినిమా అని దాని కోసం తాను ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపింది. కల్కి విడుదల తర్వాత జాతిరత్నాలు 2 మూవీ చేసే అవకాశం ఉన్నట్లు ఫరియా అబ్దుల్లా తెలిపింది .
Also Read
తాజావార్తలు
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్‌లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
Hindu Temple Demolition: పాకిస్థాన్‌లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!