రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ కూలీ. వార్ 2కి పోటీగా ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. మల్టీస్టార్లర్లతో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. సన్ పిక్చర్స్ లాల్ సలామ్, వెట్టయాన్ ప్లాప్స్ తర్వాత తలైవా నుండి వస్తున్న మూవీ కావడంతో పాటు లోకీ డైరెక్టన్ కావడంతో ఎక్స్ పర్టేషన్స్ స్కైని తాకుతున్నాయి. ఇప్పటికే రైట్స్ విషయంలో రికార్డులు మోత మోగిస్తోంది కూలీ. ఓవర్సీస్, తెలుగులో ఈ సినిమా హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది.
Also Read : Parashakti : ఇద్దరి హీరోల మధ్య చిచ్చు రేపిన టైటిల్
ఇంకా సరిగ్గా నెల రోజులు బొమ్మ థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళుతోంది యూనిట్. ఇదిలా ఉంటే ఇప్పుడు లోకేశ్ కనగరాజ్ పై సంజయ్ దత్ చేస్తున్న వ్యాఖ్యలు పలు క్వశ్చన్స్ రైజ్ అయ్యేలా చేస్తున్నాయి. లియోలో తనకు చిన్న పాత్ర ఇచ్చాడని, తనను సరిగ్గా వినియోగించుకోలేదంటూ కామెంట్స్ చేశాడు. లియో విషయంలో ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాను అని బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో సంజయ్ దత్ ఫీలయ్యేలా చేశాడు లోకేశ్ కనగరాజ్. ఇప్పుడు ఆయన రిగ్రెట్ వ్యక్తం చేయడంతో పలు డౌట్స్ స్టార్టయ్యాయి. సంజూ తన పాత్రకే న్యాయం చేయలేదని ఫీలవుతుంటే కూలీలో రజనీ కాకుండా నలుగురు స్టార్ హీరోలు నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహీర్ పరిస్థితి ఏంటీ. వీళ్లకైనా మంచి రోల్ దక్కిందా అన్న డౌట్ కలుగకమానదు. ఇప్పుడు సంజయ్ ఫీలైనట్లు ఈ హీరోలెవ్వరూ భవిష్యత్తులో రిగ్రెట్ వ్యక్తం చేసే సిచ్యుయేషన్ లోకీ తెచ్చకోడూ కదా. ఆ నలుగురు క్యారెక్టర్లకు న్యాయం చేశాడా లేదో తెలియాలంటే ఆగస్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే.
