బాలీవుడ్ కిస్సింగ్ కింగ్ ఇమ్రాన్ హష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇమ్రాన్ మూవీ అంటే ముద్దు సన్నివేశాలకు కేరాఫ్. అతడి మూవీలో కనీసం యాబైకి పైగా ముద్దు సన్నివేశాలు ఉండాల్సిందే. అయితే ఈ ఆనవాతికి బ్రేక్ వేశాడు ఇమ్రాన్. ఇకపై తన సినిమాల్లో పెద్దగా కిస్ సీన్స్ పెట్టోద్దని, అవరమైతే పెట్టాలని డైరెక్టర్లకు సీరియస్‌గా చెప్పేశాడు. దాంతో ఇమ్రాన్ సినిమాల్లో ఇలాంటి సీన్స్ తగ్గించారు తప్పిదే.. అసలు లేకుండ అయితే మొన్నటి వరకు ఏ సినిమా లేదు. అయితే తాజాగా టైగర్ 3లో నటించిన ఇమ్రాన్‌కు ఈ సినిమాలో ఒక్క కిస్ సీన్ కూడా లేకపోవడం ఆశ్చర్యకరం. అందుకే నెటిజన్లు సైతం సర్‌ప్రైజ్ అవుతూ తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు.
టైగరల్ 3లో ఇమ్రాన్‌కు జోడిగా నటించిన రిద్ధి డోగ్రాను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ ఎక్స్‌లో ఓ పోస్ట్ షేర్ చేశాడు. రిద్ధి డొగ్రాను ట్యాగ్ చేస్తూ.. ‘ఇమ్రాన్‌తో కిస్ సీన్ లేకుండ నటించిన మొట్టమొదటి నటి నువ్వే.. ఈ విషయంలో మీరు లక్కీ’ అంటూ పోస్ట్ చేశాడు. ఇక దీనిపై స్పందించిన రిద్ధి.. ఫన్నీ అంటూ కామెంట్ చేసింది. అయితే ఈ పోస్ట్‌పై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ఓ యూజర్.. ‘రిద్ధి బతికిపోయిది’ అని కామెంట్ చేయగా.. ‘అవును నిజమే’ అని మరొకరు ‘నిజం చెప్పాలంటే ఆన్‌స్క్రీన్‌పై మీ ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది.. భవిష్యత్తులో మీ కాంబినేషన్‌లో మరిన్ని సినిమాలు ఆశిస్తున్నాము’ అంటూ కామెంట్స్ చేశారు. కాగా సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ చిత్రం నవంబర్ 12 విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతంగా చేసుకుంది. టైగర్ 3లో ఇమ్రాన్ విలన్‌గా నటించగా.. అతడిగా జోడిగా షాహీన్ పాత్రల్లో రిద్ధిమా అలరిచింది.