Site icon NTV Telugu

Fahadh Faasil: నా డ్రీమ్ జాబ్ అదే.. షాక్ ఇచ్చిన షికావత్

Fahadh Faasil (2)

Fahadh Faasil (2)

భాషతో సంబంధం లేకుండా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు ఫహాద్‌ ఫాజిల్‌. ప్రస్తుతం వడివేలుతో కలిసి కామెడీ థ్రిల్లర్‌ మూవీ ‘మారీశన్‌’ లో నటించాడు. కాగా జూలై 25న అంటే నేడే ఈ చిత్రం విడుదల కూడా అయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఫహాద్‌ తన జీవిత లక్ష్యం గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

Also Read : Krithi Shetty : ఛాన్స్‌ల కోసం గ్లామర్ డోస్ పెంచేసిన బేబ్బమ్మ ..

ఫహాద్‌ మాట్లాడుతూ.. ‘సినిమాలకు రిటైర్మెంట్‌ తీసుకున్న తర్వాత నేను బార్సిలోనాలో క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తాను. ఇది నేను సరదాగా చెప్పడం లేదు. డ్రైవింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. జనాలను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఇది నా డ్రీమ్‌ జాబ్‌. గతంలో కూడా బార్సిలోనా వెళ్లాను.. నాకు బాగా నచ్చిన ప్రదేశం అది. ఆ నగరం ఎనర్జీ, కల్చర్, మార్గాలు అన్నీ నా మనసును దోచేశాయి. అక్కడికి వెళ్లి డ్రైవర్‌గా పని చేయడం నాకు నిజంగా మంచి ఫీల్ ఇస్తుంది.  ఈ విషయాన్ని నా భార్య నజ్రియాకు చెప్పా.. ఆమె కూడా సపోర్ట్ చేసింది. ఇండస్ట్రీ లో రిటైర్ మోంట్ అయిన తర్వాత, నేను అక్కడికి వెళ్లి డ్రైవర్‌గా సెటిల్‌ అవుతాను. స్పెయిన్‌ మొత్తం తిరుగుతూ ప్రజలను తిప్పుతుంటాను. ఈ విషయాన్ని నా భార్య నజ్రియాకు చెప్పా.. ఆమె కూడా సపోర్ట్ చేసింది’ అని తెలిపారు.

కానీ టాలీవుడ్, కోలీవుడ్, మలయాళ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో క్రేజ్ ఉన్న నటుడు ఓ సాధారణ ఉద్యోగాన్ని ‘డ్రీమ్ జాబ్’గా చెప్తే అది ఆశ్చర్యంగా ఉంటుంది. అతను పాపులారిటీకి పదిలంగా కాకుండా, జీవితంలో నిజమైన సంతృప్తిని వెతుక్కునే మనిషిగా కనిపిస్తున్నాడు.

Exit mobile version