NTV Telugu Site icon

కమల్ హాసన్ “విక్రమ్”లో ఫహద్ ఫాసిల్ పాత్ర ఇదే…?

Fahad Faisal Role in Kamal Hassan‘s Vikram

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ “మాస్టర్‌”తో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించారు. ప్రస్తుతం కమల్ హాసన్ తో తన తరువాత చిత్రానికి రెడీ అవుతున్నారు. కమల్ హాసన్ హీరోగా “విక్రమ్” అనే టైటిల్ తో ఈ ప్రాజెక్టు రూపొందనుంది. కరోనా ఎఫెక్ట్ తగ్గాక సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ‘జల్లికట్టు’ ఫేమ్ గిరీష్ గంగాధరన్ ఈ సినిమా సినిమాటోగ్రఫీని అందించే అవకాశం ఉంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫహద్ అవినీతిపరుడైన పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నాడని కొందరు అంటున్నారు. మరోవైపు ఫహద్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా కన్పించనున్నాడనే వార్తలు విన్పిస్తున్నాయి. అయితే మొత్తానికి విలన్ కు సాయం చేసే పాత్రలోనే ఫహద్ నటిస్తున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. గ్యాంగ్ స్టర్ విక్రమ్ గా కమల్ హాసన్ నటిస్తున్నారు. సినిమాలో దిగ్గజ నటులంతా నటిస్తున్నారనే ఉండటం వల్ల ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.