NTV Telugu Site icon

Pawan Kalyan: ఐక్యమత్యం పై పవన్ కళ్యాణ్ ట్వీట్.. అల్లు అర్జున్ అరెస్ట్ గురించేనా?

Pawan Kalyan Allu Arjun

Pawan Kalyan Allu Arjun

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కి తీసుకువెళ్లారు పోలీసులు. న్యాయమూర్తి ముందు హాజరు పరిచిన తర్వాత మెయిల్ లభిస్తుందా లేక రిమైండ్ కి తరలించాలని విషయం మీద క్లారిటీ వస్తుందని పోలీసులు చెబుతున్నారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అల్లు అర్జున్ కి వరసకు మామ అయ్యే పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. నిజానికి అల్లు అర్జున్ అరెస్ట్ కి ఈ ట్వీట్ కి ఎలాంటి సంబంధం లేదు కానీ అందులో వాడిన ఒక కొటేషన్ కారణంగా అరెస్ట్ గురించే కామెంట్ చేశాడు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే కలిసి ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం అంటూ ఒక ఇంగ్లీష్ కొటేషన్ ని పవన్ కళ్యాణ్ ని షేర్ చేశారు.


ఆ తర్వాత ‘ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా కనీసం రెండున్నర దశాబ్దాల పాటు రాజకీయ స్థిరత్వం అవసరం. మనం కులాల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోతే సాదించలేం. 21 వ శతాబ్దంలో కూడా నా కులం, నా వర్గం అంటే కష్టం. విభేదాలు, సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. ప్రతీ ఒక్కరూ అర్దం చేసుకుని విభేదాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆయన కామెంట్ చేస్తే గత కొద్దిరోజులుగా మెగా vs అల్లు కాంపౌండ్ వార్తల నేపథ్యంలో ఇది అల్లు అర్జున్ అరెస్ట్ గురించే అంటూ పలువురు భావిస్తున్నారు. అయితే అది నిజం కాదు.